చాలామంది అనుకుంటూ ఉంటారు నాలుక పై నల్ల మచ్చలు కనిపిస్తే అదృష్టమని .. వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతుంది అని .. వాళ్ళు కోపంలో ఏదైనా శపిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని నమ్ముతూ ఉంటారు . మనలో చాలామంది కూడా ఇలాంటి మాటలు విని ఉంటాం . ఆఫ్ కోర్స్ అలా నాలుగు పై మచ్చలు ఉన్నవాళ్లు మాట్లాడిన మాటలు నిజమైన మూమెంట్లో మనం కూడా అరాకొరా  ఇది కన్ఫామ్ చేసేస్తూ ఉంటాం.  కానీ ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు .


నాలుక మీద నల్ల మచ్చలు ఉంటే వాళ్ళు ఏది చెప్తే అది నిజమవుతాయి అని .. మచ్చలేని వాళ్ళు అది వినాలి అని చెప్పేదంతా ఒక మూఢ నమ్మకం మాత్రమే అని కొట్టి పడేస్తున్నారు. నాలుకపై నల్లటి ఎర్రటి రంగులో ఏర్పడే మచ్చలు శరీరంలో ప్రారంభమయ్యే కొన్ని రకాల వ్యాధులకి లక్షణాలు అంటూ వారు చెప్తున్నారు.  మరి ముఖ్యంగా చాలామందికి నాలికపై ఎర్రగులలు వస్తూ ఉంటాయి. అయితే అది బాడీ ఓవర్ హీట్ అయిన కారణంగా వస్తూ ఉంటాయి అని వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు . మరి కొంతమందికి తెల్లటి మచ్చలు లేదా నల్లటి మచ్చలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అని .. అలాంటి వాళ్లకి లుక్యోప్లాకియా అనే వ్యాధి వస్తుంది అని చెప్పడానికి ఒక లక్షణం అని అంటున్నారు.



కేవలం మచ్చలే కాకుండా నాలుక చూసి ఆ ఆధారంగా పలు రోగాలను గుర్తించవచ్చు అని వైద్యనిపుణులు చెప్తున్నారు . ఆ కారణంగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నాలుక చూపించమని అడుగుతారు అని క్లారిటీ ఇస్తున్నారు . అంతేకానీ నాలుక పై మచ్చలు ఉంటే వాళ్ళు చెప్పింది జరుగుతుంది అని పిచ్చి మూఢ నమ్మకం పెట్టుకోకండి అని హెచ్చరిస్తున్నారు. నాలుకపై నల్లటి మచ్చలు ఏర్పడి క్రీం వంటి పదార్థం ఎక్కువగా కనిపిస్తే అది కచ్చితంగా లుక్యోప్లాకియా ఆ వ్యాధికి దారితీస్తుంది అని అది తీవ్రత దాటిపోతే క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది అని కొంతమంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు . కాబట్టి మీ నాలుక పై అలాంటి మచ్చలు ఏవైనా ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించమంటూ కొంతమంది డాక్టర్స్ సలహా ఇస్తున్నారు.

 

నోట్  : ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఇంటర్నెట్లో పొందుపరిచిన ఆధారంగా సేకరించబడినది.  అంతేకానీ ఇది ఏ విధంగా ఇండియా హెరల్డ్ ధ్రువీకరించలేదు . మీకు ఏదైనా అనుమానాలు ఉంటే డాక్టర్లను  సంప్రదించడం  మంచిది అని గుర్తుపెట్టుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: