
హలో.. ఈ జాబితాలో మీరు ఉన్నారా? అయితే జాగ్రత్త బాస్. ఎందుకంటే ఆ అలవాటు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బిర్యానీ ఓ భారీ, మసాలా ఉన్న ఆహారం. దాంతో పాటు షుగర్ మరియు కార్బొనేషన్ ఉన్న కూల్ డ్రింక్ తాగితే జీర్ణత వ్యవస్థపై అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది.
అలాగే బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగడం వల్ల కొందరు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను అనుభవిస్తారు. బిర్యానీకి సగటున 500 నుంచి 900 కేలరీలు ఉంటాయి. అలాగే ఒక గ్లాస్ కూల్ డ్రింక్ కు సుమారు 100 నుంచి 150 కేలరీలు ఉంటాయి. ఒకేసారి ఇన్ని కేలరీలు తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు. డయాబెటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. పైగా ఒక బాటిల్ కూల్ డ్రింక్‌లో సుమారు ఎనిమిది నుంచి పది స్పూన్లు చక్కెర ఉంటుంది. ఇంత మొత్తం చక్కెర తీసుకుంటే బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు మరియు దంత సమస్యలతో సహా అనేక రకాల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారితీస్తుంది. సో.. ఇకపై కూల్ డ్రింక్ ను తాగడం తగ్గించండి. ముఖ్యంగా బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగే అలవాటును కచ్చితంగా వదులుకోండి. కూల్ డ్రింక్ కు బదులు మజ్జిగ లేదా పుదీనా-జీలకర్ర వాటర్ ను తీసుకోవడం ఎంతో ఉత్తమం.