ఏప్రిల్ 30వ తేదీన ఒక సారి చరిత్రలోకి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి.  మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 టంగుటూరి ప్రకాశం పంతులు : 1946 ఏప్రిల్ 30వ తేదీన మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి బాధ్యతలు చేపట్టారు. 

 

 దాదాసాహెబ్ ఫాల్కే జననం :  అంకితభావం  అరుదైన కృషి ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలనచిత్ర రంగం ఆవిష్కృతమైంది. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే. ఈయన 1875 ఏప్రిల్  30 వ తేదీన జన్మించారు. భారతీయ సినీ నిర్మాత దర్శకుడు స్క్రీన్ ప్లే  రచయిత అయిన ఈయన భారత సినిమా పితామహుడిగా ఎంతగానో ప్రసిద్ధి చెందాడు. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర. ఈయన  జీవితంలో మొత్తం 95 ఫీచర్ ఫిలిమ్స్ నిర్మించాడు దాదా సాహెబ్ ఫాల్కే. ప్రారంభదశలో డ్రామా కంపెనీలో నిమిత్తం ఒక ఫోటోగ్రాఫర్ గా సీన్ పెయింటర్ గా  జీవితాన్ని మలచుకున్నాడు దాదాసాహెబ్ ఫాల్కే. ఇక ఈయనని  భారత సినీ పరిశ్రమకు పితామహుడిగా పిలుచుకోవడమే కాదు... ఈయన  పేరుతో ఒక గౌరవప్రదమైన అవార్డును కూడా అందజేస్తారు. ఇది ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోనే గొప్ప అవార్డు గా భావిస్తారు సినీ నటులు. 

 

 

 శ్రీశ్రీ జననం : ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ ఈయన ఏప్రిల్ 30 1910 వ తేదీన జన్మించారు. ఆయన పూర్తిపేరు శ్రీరంగం శ్రీనివాసరావు. కానీ భారత ప్రజలందరికీ శ్రీశ్రీగా ఎంతగానో ప్రసిద్ధుడయ్యాడు ఈయన. విప్లవ కవిగా సాంప్రదాయ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా సినిమా పాటల రచయితగా ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశ్రీ ఎన్నో కలలతో  ఎన్నో  రోజుల పాటు మహాకవిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు అని చెప్పారు. హేతువాది నాస్తికుడు ఆయన శ్రీశ్రీ మహాకవి గా విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం శ్రీశ్రీ రచించిన కావ్యాలలో  ఎంతగానో ప్రసిద్ధి చెందింది. శ్రీశ్రీ చిన్నవయసు నుంచే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. 18వ యేటనే ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించాడు శ్రీ శ్రీ. ఇక 1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది మహాప్రస్థానం ద్వారా శ్రీశ్రీ గొప్పతనం అందరికీ తెలిసింది.  ప్రజలు విప్లవ కాంక్షను రగల్చటానికి   శ్రీ శ్రీ కవితలు ఎంతగానో ప్రభావితం చేస్తాయి. 

 

 

 రోహిత్ శర్మ జననం : భారత జట్టులోని స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30వ తేదీన జన్మించారు. భారత జట్టుకు టి 20 వన్డే జట్టుకు కెప్టెన్ గా  ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు . రోహిత్ శర్మ 2007లో ఐర్లాండ్ భారతదేశం యొక్క పర్యటన పరిమిత ఓవర్ల మ్యాచ్ కి మొదటిసారి అంతర్జాతీయ జట్టులోకి ఎంపిక అయ్యాడు. రోహిత్ శర్మ తనదైన బ్యాటింగ్ శైలి తో టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో  ఎన్నోసార్లు తో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం రోహిత్ శర్మ భారత జట్టు స్టార్ ఓపెనర్గా... డబుల్ సెంచరీ ల ధీరుడిగా ... సిక్స్ ల వీరుడిగా చెప్పుకుంటారు.. 

 

 

 దుర్భాక రాజశేఖర శతావధాని మరణం : వైఎస్ఆర్ జిల్లా అవధానములలో మొదట చెప్పుకోదగిన వాడు అయిన దుర్భాక రాజశేఖర శతావధాని 1957 ఏప్రిల్ 30వ తేదీన మరణించారు. ఈయన లలిత సాహిత్య నిర్మాత పండితుడు. పొద్దుటూరు నివాసి అయిన ఈయన  వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1898 లో జన్మించారు. 

 

 

 దూసి ధర్మారావు మరణం : తెలుగు కవి సాహితీ కారులు రచయిత గీత రచయిత సంఘసేవకుడు అయినా దూసి ధర్మారావు 2017 ఏప్రిల్ 30వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: