శరీరానికి మద్దతు ఇచ్చే వ్యవస్థగా ఎముకలను పేర్కొనవచ్చు అవునా! ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలో ఉన్న మిగ‌తా అన్ని భాగాలు ప‌టిష్టంగా ఉంటాయి. ఎముక‌లు ఏమాత్రం విరిగిపోయినా శ‌రీరంలో ఉన్న మిగ‌తా భాగాలు అతుక్కోవు.   ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండుటకు తీసుకోవలసిన ఆహారాలు మరియు క్రియల గురించి ఈ రోజు బుడుగు శీర్షిక‌లో తెలుసుకుందాం... ఎముకలను బలంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచుకోవటం మన భాద్యత. మీ జీవనశైలిలో అనుసరించే అలవాట్ల పై కూడా మీ శరీర ఎముకల దృఢ‌త్వం మరియు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

 


ఎముకలు దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం తప్పని సరి అని చెప్పవచ్చు. అధిక మొత్తంలో కాల్షియంను కలిగి ఉండే ఆహార పదార్థంగా పాలను చెప్పవచ్చు. రోజు తక్కువ ఫాట్ కలిగిన రెండు గ్లాసుల పాలు మరియు హోల్ గ్రైన్స్’లను తినటం వలబ శరీరానికి కావలసిన కాల్షియంను పొందవచ్చు. బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకల నిర్మాణంలో కాల్షియం పాత్రతో సమానమైన పాత్ర విటమిన్ ‘D’ కూడా పోషిస్తుంది. గుడ్డులో శరీరానికి కావలసిన స్థాయిలో విటమిన్ ‘D’ ఉంటుంది మరియు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. గుడ్డులోని పచ్చసోనలో మాత్రమే విటమిన్ ‘D’ ఉంటుంది.


అధిక ఉప్పు సేకరణ వలన శరీరంలోని కాల్షియం స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినటం వలన శరీరంలో ఉన్న కాల్షియం మూత్రం ద్వారా భయటకు పంపబడుతుంది. ఉప్పు తక్కువగా ఉన్న ఆహార సేకరణ వలన మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చేప మాంసం, శరీరానికి కావలసిన పోషకాలను అందించి, ఎముక ద్రవ్యరాశిని పెంచుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండుటకు ‘సార్డైన్’ మరియు ‘సాల్మన్’ చేపలను తినండి. అధిక మొత్తంలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్’లతో పాటూ, కాల్షియం మరియు విటమిన్ ‘D’లు అధికంగా ఉన్న వాటిని తినటం వలన ఎముకల ఆరోగ్యం పెంపొందించబడి, దృఢంగా మారతాయి.

 

ఆరోగ్యకరమైన స్నాక్స్’లను తినటం వలన వివిధ మార్గాల ద్వారా ఎముకల ఆరోగ్యం పెంపొందించబడుతుంది. వేరుశనగ మరియు బాదంల నుండి ప్రోటీన్, శరీరానికి అవసరమైన పోషకాలతో పాటూ, ఎముకల దృడ నిర్మాణానికి అవసరమైన పోషకాలు అందించబడతాయి. ఆక్రోటుకాయలు మరియు ఫ్లాక్స్ సీడ్స్’ల నుండి ఎముకలను దృడంగా ఉంచే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్’లను అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: