జ్యూసీగా..నోరూరిస్తూ ఉండే మామిడిపండ్లన్నా, పుల్లగా..వగరుగా..కమ్మగా ఉండే పచ్చిమామిడికాయలన్నా పిల్లలకు పెద్దలకు మహా ప్రీతి. అందులోని రుచిని, సువాసనను వర్ణించడం సాధ్యం కాదు.పిల్లలకు మామిడి కాయ అంటే మహా ఇష్టం. ఇది సీసనల్ పండు కాబట్టి ఇష్టంగా తింటారు. దీని వల్ల పిల్లలకు  న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కూడా అధికమే.. పచ్చివి తిన్నా, పండువి తిన్నా వేటి ప్రత్యేకతలు వాటివి.

IHG

ఆరోగ్య ప్రయోజనాలు అంతే..సువానతో నోరూరించే మామిడి పండ్లంటే పిల్లల నుండి పెద్దల వరకూ అన్నివయస్సుల వారికి అమితనమైన ఇష్టమే. పచ్చి మామిడి పండ్లలో ఉండే హెల్తీ న్యూట్రీషియన్స్, మినిరల్స్ అనేక వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు  పచ్చిమామిడి కాయను ఉప్పుతో కలిపి తినడం వల్ల శరీరంలో నీటిశాతం కోల్పోకుండా నివారిస్తుంది. అందువల్ల వేసవిలో హై టెంపరేచర్ సైడ్ ఎఫెక్ట్స్ ను నివారిస్తుంది.

IHG

మామిడి కాయను వంటలకు వండటేటప్పుడు ఉడికించడం వల్ల విటమిన్ c ని కోల్పోతుంది. కాబట్టి, పచ్చిమామిడికాయను సాధ్యమైనంత వరకూ పచ్చిగా అలాగే తింటే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ను పొందుతారు.పచ్చి మామిడికాయలు బరువు తగ్గిస్తాయి. పచ్చిమామిడికాయలను తినడం వల్ల లివర్ వ్యాధులను నయం చేసుకోవచ్చు. పిల్లలకు ఎక్కువగా దంత సమస్యలు వస్తాయి.

IHG

కాబట్టి దంతాలను శుభ్రపరచడంలో పచ్చి మామిడికాయలు గ్రేట్ గా సహాయపడుతాయి. బ్యాడ్ బ్రీత్ ను తొలగించడంతో పాటు, దంత క్షయాన్ని నివారిస్తాయి. కాబట్టి, ఈ సీజన్ లో పచ్చిమామిడికాయను పిల్లలకు తినిపించడం మర్చిపోకండి. దంతక్షయానికి వ్యతిరేఖంగా పోరాడుతాయి. పచ్చిమామిడికాయను తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. దీని వలన పిల్లల ఎదుగుదల బాగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: