దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక చిన్న పిల్లలు ఈ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు ఈ ఆహార పదార్దాలు పెట్టండి. ఇక రోజూ ఉదయం వేళ పిల్లలకు తప్పనిసరిగా పాలు ఇవ్వండి. కొంత మంది టీ ఇస్తారు. అలా కూడా ఇవ్వొచ్చు. బ్రేక్ పాస్ట్ కోసం చపాతీలు, ఇడ్లీలు, పరాఠాలు, దోసెలు ఏవైనా పెట్టొచ్చు. వాటిలో కాస్త వేరుశనగ చట్నీ, లేదా పప్పు ఉండేలా చెయ్యండి. వీలైతే ఓ ఉడకబెట్టిన గుడ్డు జత చెయ్యండి. మధ్యాహ్నం భోజనం పెట్టే లోపు మధ్యలో ఓ అరటిపండో, పుచ్చకాయ జ్యూసో వంటిది ఏదైనా రసం లాంటిది ఇవ్వండి. తద్వారా జీర్ణక్రియ బాగా జరిగి విటమిన్స్ బాడీ మొత్తం అందుతాయి.

అలాగే మధ్యాహ్నం రైస్‌తోపాటూ ఏదైనా కర్రీ ఇవ్వండి. ఈ కర్రీలు వారంలో రకరకాలవి వండాలి. మాంసం, గుడ్లు, చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు ఇవన్నీ వారంలో పిల్లలకు అందేలా చెయ్యాలి. ప్రతి వారం ఇవన్నీ అందుతున్నదీ లేనిదీ చెక్ చేసుకోవాలి. మాంసం తినని వారు. వారానికి రెండుసార్లు కందిపప్పు కూర వండిపెట్టాలి. అలాగే గుడ్లు కూర తప్పనిసరిగా వారంలో 2సార్లు వండాలి. ఆకుకూరల్లో విటమిన్లు, పోషకాలు ఎక్కువ. పిల్లలు వద్దు అని మారం చేసినా అవి వారు తినేలా చెయ్యాలి. వాటిలో అప్పడం, వడియాల వంటివి జతచేసి పెట్టండి. అప్పుడు తింటారు. చివర్లో పెరుగుతో అన్నం తినేలా అలవాటు చెయ్యండి.

ఇక రాత్రి వేళ అన్నం కంటే చపాతీ, రోటీ, పుల్కా వంటివి మేలు. వాటితోపాటూ... రకరకాల కర్రీలు పెట్టాలి. ఒక్కో రోజు ఒక్కో కర్రీ వండాలి. చాలా మంది మధ్యాహ్నం వండిన కర్రీనే రాత్రి కూడా పెడతారు. అదేమీ ప్రాబ్లం కాదు. రెండేసి కర్రీలు వండే టైమ్ ఉండే వండొచ్చు. లేదంటే లేదు. ఏదైనా సరే... పిల్లలు తినేలా చెయ్యాలి. వారి ఫుడ్ విషయంలో పూర్తి సంతృప్తితో తినేలా చెయ్యాలి. చివర్లో మజ్జిక ఇస్తే మంచిదే. ఇలా ప్రతి వారం వారికి సమగ్రంగా అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ అందుతున్నాయో లేదో గమనించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: