ప్రతి ఒక్క పండు, కాయలలో ఆరోగ్యం ఉంటుంది. శరీరానికి కావలసిన పోషకాలు దాగివున్నాయి. అందుకే సీజన్ లో దొరికే ప్రతి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే డాక్టర్లు కూడా పండ్లను ఎక్కువగా తీసుకోవాలని  సూచిస్తారు. అయితే ఇప్పుడు పనస పండు తినడం వల్ల ఎటు వంటి ఆరోగ్యం ఉంది అనేది చాలా మందికి తెలియదు. కానీ తియ్యగా ఉంటుందని తింటారు. పనస వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదట.. అంత ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...


వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస పండు ఒకటి. భారీ పరిమాణంతో ఉండే పండు చూడ్డానికి వింతగా కనిపించినా.. అందులోని పనస తొనలు నోరూరిస్తాయి. ఈ తొనలు కేవలం రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అందుకే పనసపండును ఆయుర్వేదంలో ఔషధ గని అని పిలుస్తారు. అన్ని ఔషధ గుణాలు కలిగిన పనస పండును తినడం వల్ల మనిషి ఆయుష్ పెరుగుతుందని అంటున్నారు..పనసలో ఫైబర్, విటమిన్- సి, విటమిన్- ఎ, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, భాస్వరం, కాల్షియం కూడా ఉంటాయి. ఇది బీటా కెరోటిన్, లుటిన్, మరియు జియాక్సంతిన్లతో సహా గణనీయమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంది.


చర్మ సంరక్షణ మెరుగవుతుంది,బరువు తగ్గుతారు, జీర్ణక్రియ బాగుంటుంది,శక్తిని పెంచుతుంది,రోగనిరోధక శక్తి పెరుగుతుంది,శ్వాసకోశ ఆరోగ్యం మెరుగ్గా పనిచేస్తుంది,రక్తపోటు తగ్గుతుంది,నిద్రను ప్రేరేపిస్తుంది..ఇవే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి..గరుకుగా ఉన్నా కూడా వీటిలో చాలా మంచి పోషకాలు ఉండటం వల్ల ఎక్కువగా తీసుకోవడం మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలా తీసుకోవాలని అంటే.. పండుగా అయిన తర్వాత వాటిలో తోనలను తినవచ్చు ..పచ్చిది, కాల్చినది, ఉడికించినది తినచ్చు. అలాగే మీకు ఇష్టమైన చాలా రకాల వంటలైన సలాడ్లలో, ప్రోటీన్ ఎంట్రీగా, కూర లోపల, డెజర్ట్ లలో వీటిని చేర్చుకుని తినచ్చు... ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసారుగా ఇప్పటి నుంచి తినడం మొదలు పెట్టండి...

మరింత సమాచారం తెలుసుకోండి: