దక్షిణ భారతదేశంలో ప్రతి రోజు అల్పాహారంలో ఏమున్నాయి అంటే.. అందరూ తడుముకోకుండా ఇడ్లీ, దోస దగ్గరే ఆగిపోతారు. సాయంత్రం టిఫిన్ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఇడ్లీ,  దోశ లనే ఎక్కువగా  తీసుకుంటూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దోషాలకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే దోసెలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనే భయం ఉండదు.. డయాబెటిస్ వారు కూడా పుష్కలంగా తినవచ్చు. అయితే ఎక్కువగా దోషలను బియ్యం , మినప్పప్పు తో ఎక్కువగా చేస్తారు. కాబట్టి దోసెలను తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు.

ఇకపోతే చక్కగా ఇంట్లో దోశలు వేయడం అనేది కొంతమందికి చాలా కష్టమైన విషయం అని చెప్పాలి  ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే వంట నేర్చుకునేవారి కోసం  చక్కటి దోశలు కావాలంటే కొన్ని టిప్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హోటల్ స్టైల్ దోశ కావాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రుచికరమైన క్రిస్పీ దోస మీరు కూడా తయారు చేయవచ్చు. అయితే మీరు దోశ పిండి కి బియ్యం నాన పెట్టేటప్పుడు.. కొలతల ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రెండు గ్లాసుల బియ్యానికి.. పావు గ్లాస్ మినప్పప్పు.. పావు గ్లాస్ శనగపప్పు,  ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా నానబెట్టాలి.

ఆ తర్వాత మిక్సీ పట్టే పది నిమిషాల ముందు అటుకులు నానబెట్టి అందులో కలిపేయాలి. అన్నింటిని బాగా వాష్ చేసి తర్వాత మిక్సీ జార్ లో మెత్తగా ఆడించాలి. ఇక ఉదయం దోశ వేస్తామనగా  ముందు రోజు అవసరమైనంత పిండి తీసుకొని బయటపెట్టి ఏదైనా ఒక కాటన్ క్లాత్ కప్పి ఉంచాలి. మరుసటిరోజు పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు.. ఆ చిటికెడు సోడా పొడి.. ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ.. అర టేబుల్ స్పూన్ చక్కెర వేసి బాగా కలియబెట్టాలి. పది నిమిషాలు ఆగిన తర్వాత వేడి వేడి పెనం మీద దోశ వేస్తే క్రిస్పీగా టేస్టీగా కరకరలాడే దోసె మీరు కూడా వేసినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: