ఇలా చేస్తే కీళ్ళ నొప్పులు మాయం?
ప్రస్తుతం వివిధ కారణాల వల్ల కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వం వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడేవారు. ఆధునిక జీవన శైలి కారణంగా యువత కూడా ఈరోజుల్లో కీళ్ళ నొప్పుల సమస్యలకు గురవుతున్నారు. వాతావరణం మారినప్పుడల్లా కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతున్నాయి.ఆర్థరైటిస్ సమస్య కారణంగా మోకాళ్లలో, కీళ్లలో వాపు వస్తున్నాయి. దీని వల్ల కీళ్లలో నొప్పులు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా కీళ్లలో దృఢత్వం తగ్గి పోయి. వివిధ రకాల వ్యాధులకు కూడా గురవుతున్నారు. కాబట్టి ఒక్క సారి కీళ్ల నొప్పులకు గురవుతే పలు రకాల జాగ్రత్తలు వహించడం చాలా మంచిది.ఒత్తిడి లేదా కీళ్లకు వివిధ రకాల గాయాలు కావడం వల్ల తరచుగా కీళ్లలో నొప్పులు వస్తున్నాయని ఆయుర్వేద వైద్యులు మోకాళ్లు నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఏదో ఒక కారణంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.కాల్షియం, విటమిన్-డి ఉన్న ఆహాలు తీసుకుంటే సులభంగా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడతాయి. కాబట్టి దీని కోసం మీరు రోజూ 15 నిమిషాల పాటు ఎండలో కూర్చొండి.కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుంగా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించడమేకాకుండా శరీరం ఫిట్‌గా మారుతుంది.కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీని కోసం మీరు ఆలివ్ నూనె, పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరానికి పోషకాలు ఇచ్చే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.