ఇప్పుడున్న జీవనశైలికి ఎన్నో రోగాలు మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఆ రోగాలన్నీ మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనకు రోగనిరోధకశక్తి చాలా అవసరం. మన రోగ నిరోధక శక్తి పెంచి ఆరోగ్యవంతంగా ఉంచడానికి, ప్రకృతి చాలా ఔషదాలను ప్రసాదించింది. అందులోనివే గసగసాలు.వీటిని పాలతో కలిపి మూడు రోజుల పాటు తాగితే చాలు వృద్ధాప్య ఛాయలు అంత తొందరగా రావు. వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి వచ్చి, నీరసం, నిస్సత్తువ, అలసట వంటి సమస్యలను తగ్గించే గుణం గసగసాల్లో అధికంగా ఉంటుంది.రక్తంలోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసి,మధుమేహం రాకుండా సహాయపడుతుంది.చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, శరీరబరువును కంట్రోల్ లో ఉంచుతుంది.అదేవిధంగా కీళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులను తగ్గిస్తుంది. దీనిని రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారుతాయి.

ఒక స్ఫూన్ గసగసాలను తీసుకొని, వాటిని ఒక గ్లాస్ పాలల్లో వేసి ఊడికించుకోవాలి.ఆ తరువాత ఆ పాలను గోరు వెచ్చగా అయ్యే వరకు చల్లార్చి, అందులో రుచికి సరిపడా బెల్లం లేదా పటిక బెల్లాన్ని వేసుకుని రోజూ రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.ఏ విధంగా త్రాగటం వల్ల గసగసాల్లో ఉండే పోషకాలను పుష్కళంగా పొందవచ్చు. పాల అలెర్జీ కలవారు గ్లాస్ నీటిలో, టీ స్పూన్ గసగసాలను వేసి రాత్రంతా నాననివ్వాలి. ఆ తర్వాత ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి గసగసాలను నమిలి మింగాలి.ఇలా త్రాగిన కూడా మంచి ఫలితం ఉంటుంది.

 ఈ విధంగా గసగసాలు కలిగిన పాలు త్రాగటం,ఇది వేడిని తగ్గించి, శరీరానికి చలువ చేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఫైల్స్ సమస్యతో బాధపడే వారు గసగసాలను ఇలా పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. దగ్గు, ఉబ్బసం, క్షయ, షుగర్ వంటి వాధ్యులతో బాధపడేవారికి కూడా ఈ పాలు చాలాబాగా ఉపయోగపడతాయి. గసగసాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు తొందరగా కరిగిపోతాయి.రక్తప్రసరణను పెంచి, గుండె సంబంధిత రోగాలు దరి చేరకుండా కాపాడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: