లివర్ దెబ్బతింటే మనం తీవ్ర అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి మనం కాలేయానికి మేలు చేసే ఆహారాలను ఇంకా కాలేయ పనితీరును మెరుగుపరిచే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. కాలేయానికి హానిని కలిగించే ఆహారాలకు ఖచ్చితంగా మనం వీలైనంత దూరంగా ఉండాలి. మనలో చాలా మంది కూడా కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇంకా అలాగే మద్యపానం కూడా చేస్తూ ఉంటారు. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది.ఇంకా అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవకాడో పండ్లు మనకు బాగా సహాయపడతాయి. ఇంకా వీటిలో గ్లూటాథియోన్ ఎక్కవు మోతాదులో ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కాలేయం డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వర్తించేలా చేయడంలో కూడా బాగా సహాయపడుతుంది.జామకాయలు మనకు  అన్ని కాలాల్లో లభిస్తూ ఉంటాయి. కాబట్టి రోజుకు ఒక జామకాయను మీరు తప్పకుండా తీసుకోవాలి. ఇంకా అదే విధంగా స్టార్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు బాగా మెరుగుపడుతుంది.ఎందుకంటే దీనిలో 8 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కాలేయం డిటాక్సిఫికేషన్ ప్రక్రియను చక్కగా నిర్వర్తించేలా చేయడంలో కూడా సహాయపడతాయి.


ఇంకా అదే విధంగా బ్లాక్ గ్రేప్స్, రెడ్ గ్రేప్స్ ను తీసుకోవడం వల్ల కూడా కాలేయ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. ఇక వీటిలో రస్వట్రాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది కాలేయంలో డిటాక్సిఫికేసన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.ఇంకా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు, ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు అవకాడోను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ వంటి వాటిని తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి మనకు డ్రై రూపంలో కూడా లభిస్తాయి. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. అలాగే వ్యర్థాలు ఏ రోజుకు ఆ రోజు బయటకు పంపించబడతాయి. ఇంకా అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు జామకాయ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల జామపండులో 200 మిల్లీ గ్రాముల విటమిన్ సి అనేది ఉంటుంది. మన శరీరంలో ఎంత ఎక్కువగా విటమిన్ సి ఉంటే కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ అంత బాగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: