మనం ఎన్ని స్వీట్స్ తిన్నా వాటిల్లో కేసరికి ఉండే టేస్టే వేరు.ప్రతీ ఒక్క ఫంక్షన్ లో ఈ కేసరి కంపల్సరీ.వ్రతాలకి, పూజలకి, పెళ్లిళ్ళకి,పుట్టిన రోజుకి, ఇంటికి ఎవరైనా అతిధులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు,ఇలా ప్రతీ ఒక్క సందర్బాల్లో దీన్ని తింటూ వుంటారు,సేమ్యా కేసరి, క్యారెట్ కేసరి,పైనాపిల్ కేసరి,గోధుమ రవ్వ కేసరి,ఉప్మా రవ్వ కేసరి, ఇలా చాలా రకాలుగా ఈ స్వీట్ ని చేసుకుంటాం.సమయం కూడా పెద్దగా పట్టదు.నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ కేసరిని ఈజీ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం.దీని తయారీ విధానానికి కావాలసిన పదార్ధాలు. కప్పు బొంబాయి రవ్వ,హాఫ్ కప్పు నెయ్యి,పది బాదం పప్పు, పది జీడిపప్పు, పది కిస్మిస్, నాలుగు యాలకులు, కప్పున్నర చక్కెర,కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్.ముందుగా ఒక పాన్ లో హాఫ్ కప్ నెయ్యి వేసుకుని వేడి అయ్యాక అందులో జీడిపప్పు, బాధం పప్పు, కిస్ మిస్ వేసి బాగా వేపి పక్కన పెట్టుకోవాలి.


అదే నేతిలో ఒక కప్పు బొంబాయ్ రవ్వ వేసి రెండు నిముషాలు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఒక కప్పు బొంబాయ్ రవ్వ కి నాలుగు కప్పులు వాటర్ వేసి మరిగాక అందులో చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేయాలి.ఇప్పుడు బాగా కలిపి రవ్వ వేడిగా ఉన్నపుడే ఈ నీళ్లు రవ్వలో పోయాలి.ఈ రవ్వని రెండు నిముషాలు సన్నని మంటమీద ఉడికించుకోవాలి రవ్వ దగ్గర పడుతున్న టైం లో ఒకటిన్నర కప్పు పంచదార వేసి బాగా కలపాలి. ఇంకో రెండు నిముషాలు అలా కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది.ఫైనల్ గా ఇందులో వేయించి పెట్టుకున్న బాధం జీడిపప్పు కిస్మిస్ వేసి, అందులోనే నాలుగు ఇలాచిని కూడా దంచి వేసుకుకోవాలి. ఇలాచి వేసుకోవడం వల్ల మంచి సువాసన రుచి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విదంగా తయారు చేసుకున్న బొంబాయ్ రవ్వ కేసరి చల్లారిన తరువాత కూడా గట్టిగా కాకుండా మెత్తగా  ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది.మరి మీరు అప్పుడప్పుడు ఈ విధంగా రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి.దీన్ని పిల్లల నుంచి పెద్దలు దాకా చాలా ఇష్టంగా తింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: