మన మెదడు, నరాల కణాలు కలిసి పనిచేయడం వల్లనే మనం అన్ని పనులను ఈజీగా చేసుకోగలుగుతాము. అయితే మన మెదడు కణాలు, నరాల కణాలు ఒక్కసారి నశిస్తే మళ్ళీ అవి తిరిగి బాగుకావు. మనం పుట్టినప్పుడు వృద్ది చెందిన కణాలే మన లైఫ్ లాంగ్ ఉంటాయి. మరణించిన మెదడు కణాల స్థానంలో, నరాల కణాల స్థానంలో మళ్ళీ కొత్త కణాలు రావడం జరగదు. కాబట్టి వీటిని మనం జీవితకాలం పాడవకుండా కాపాడుకోవాలి.ఉలవల్లో ఇనులిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇవి మన ప్రేగుల్లోకి వెళ్లిన తరువాత మన ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఈ ఫైబర్ ను పులియబెట్టి స్కీలో ఇనోసిటాల్ అనే రసాయనాన్ని తయారు చేస్తాయి. ఈ రసాయన సమ్మేళనం నరాల కణాలపై పేరుకుపోయిన హానికరమైన ప్రోటీన్ ను తొలగించి నరాల కణాలను, మెదడు కణాలను కాపాడుతుంది. అలాగే ఉలవలను తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ మెదడు కణాల్లోకి, నరాల కణాల్లోకి వెళ్లి కణాలు మరింత శక్తివంతంగా పని చేస్తాయి. అలాగే ఉలవలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గడంతో పాటు పాంక్రియాసిస్ గ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.


అంతేకాకుండా ఉలవలు చాలా బలమైన ఆహారం. వీటిని తీసుకోవడం వల్ల కణాల్లో శక్తి ఎక్కువగా తయారవుతుంది.మెదడు కణాలను, నరాల కణాలను డిటాక్సిఫికేషన్ చేయడంలో ఉలవలు మనకు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. మెదడు కణాలపై, నరాల కణాలపై హానికలిగించే కొన్ని రకాల ప్రోటీన్స్ పేరుకుపోతాయి. ఇవి మెదడు కణాలను, నరాల కణాలను నెమ్మదిగా దెబ్బతీస్తూ ఉంటాయి. దీంతో కణాల పనితీరు దెబ్బతింటూ ఉంటుంది. ఇలాంటి హానికారక ప్రోటీన్ ను తొలగించి కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉలవలు మనకు ఎంతగానో సహాయపడతాయి.ఈ రకంగా ఉలవలు మన ఆరోగ్యానికి, మెదడు కణాలకు, నరాల కణాలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉలవలను ఉడికించి గుగ్గిళ్లుగా తయారు చేసి తీసుకోవచ్చు.ఇంకా అలాగే వీటిని మొలకెత్తించి కూడా తీసుకోవచ్చు. ఇలా ఏ విధంగా తీసుకున్నా కూడా ఉలవలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: