ప్రెసెంట్ జనరేషన్ లోకిరా దోస కాయని పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ పూర్వకాలంలో మాత్రం కీరదోసనం ఎంతో ఇష్టంగా తినేవారు. కీర దోసలో ఉండే బెనిఫిట్స్ చూస్తే నేటి తరం కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కీర దోసకాయ రుచినే కాదు శరీరానికి కావాల్సిన పోషకాన్ని కూడా పుష్కలంగా అందిస్తుంది . ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది . శరీరానికి మేలు చేసే విటమిన్ సి అండ్ కెఫియక్ యాసిడ్ లాంటివి ఎక్కువగా ఉంటాయి . ఇక దీని తొక్క లో పీచు పదార్థంతో పాటు ఉండే సిలికా,  మెగ్నీషియం మరియు పొటాషియం లాంటి ఖనిజాలు కండరాలు మరియు ఎముకలు ఇతర అవయవాలను స్ట్రాంగ్ గా ఉంచుతాయి .

కిరా లో 95% నీరు మరియు ఫైబర్ , మెగ్నీషియం , మాంగనీస్ , పొటాషియం వంటి ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి . ఇవి అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తూ ఉంటాయి . అందుకే కీరాను వేసవిలో సూపర్ ఫుడ్ అని అంటూ ఉంటారు . చాలామంది దీనిని సలాడ్ గా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు . అందుకే కీరా తొక్క తీసి తినాలా? తీయకుండా తినాలా అనే సందేహం చాలా మందిలో ఉంటూ ఉంటుంది. ఈ రెండు పద్ధతుల్లోకి రా తొక్క తీయకుండా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు . ఎందుకంటే తొక్కలో ఫైబర్ తో పాటు అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి . అయితే తొక్క తో తినడానికి ముందు దానిని శుభ్రంగా కడగాలని సూచిస్తున్నారు నిపుణులు .

10 నుంచి 15 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెడితే వీటిపై ఉన్న క్రిములు పోయి మంచి గుణాలు ఉంటాయని చెబుతున్నారు . కీర జీర్ణ క్రియ కు మేలు చేస్తుంది . ఇది మలబధకం మరియు గ్యాస్ వంటి సమస్యలను దరి చేరకుండా చూసుకుంటుంది . ప్రతిరోజు మీ డైలీ రొటీన్ లో కీరా చేర్చుకోవడం చాలా మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు . క్షీర దోసలో 95% నీరు ఉండడం వల్ల బాడీ డిహైడ్రేషన్ కూడా బాగా అవుతుంది . హైడ్రేట్ గా ఉండడంలో చాలా బాగా సహాయపడుతుంది . అందువలనే ప్రతిరోజు మీ డైలీ రొటీన్ లోకిరా చేర్చుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు . అతి తక్కువ ధరలో దొరికే కీరాతో ఎన్ని ప్రయోజనాలు ఉంటే ఎవరు తినకుండా ఉంటారు .

మరింత సమాచారం తెలుసుకోండి: