చాలామంది ఇళ్లల్లో తెగిపోయిన చెప్పులు .. విరిగిపోయిన వస్తువులు..పగిలిపోయిన ..అద్దాలు .. కొందరికి జ్ఞాపకార్థంగా ఉంచుకుంటూ ఉంటారు . అయితే అది చాలా చాలా తప్పు అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకుంటే అది నెగిటివ్ ఎనర్జీని సూచిస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు.  అంతేకాదు ఆ ఇంటికి అసలు మంచి కలిసి రాదని .. ఎప్పుడూ ఆ ఇంట్లో భార్యాభర్తలు చికాకులతో.. గొడవలతో ..అరుపులతో.. కేకలతో రాద్ధాంతాలు సృష్టించుకుంటూనే ఉంటారు అని .. పిల్లలకు చదువు కలిసి రాదు అని డబ్బు పరంగా కూడా సంపాదించింది అంతా ఖర్చయిపోతుంది అని హెచ్చరిస్తున్నారు .


కొన్ని కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి కన్నా చెడే జరుగుతుంది అని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "పాత చెప్పులు". పనికిరాని చెప్పులు..  తెగిపోయిన చెప్పులు.. చెప్పులు అవసరానికి మించి ఎక్కువగా ఉన్నా కూడా అది దరిద్రమే అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు . చెప్పులు ఇంట్లో ఎక్కువగా ఉంటే అది శనికి వెల్కమ్ పలికినట్టే అంటున్నారు. శనివారం నాడు ఇటువంటి చెప్పులను బయటపడేస్తే ఇంకా ఇంకా మంచిది అంటున్నారు. అవసరానికి సరిపడా చెప్పులు మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి అని మిగతావన్నీ బయటపడేయాలని సూచిస్తున్నారు .



అదే కాదు చినిగిపోయిన బట్టలు .. పాత బట్టలు, అల్మారాల్లో దురికి దురికి  దాచి పెట్టుకోవడం వల్ల దరిద్ర దేవత అక్కడ కొలువై ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు కొంతమంది పగిలిపోయిన అద్దాన్ని కూడా అంటించుకుని లేదా అడ్జస్ట్ చేసుకొని అందులోనే ముఖం చూస్తూ ఉంటారు.  అది మహా మహా దరిద్రం అంటూ హెచ్చరిస్తున్నారు.  పగిలిపోయిన అద్దం ఇంట్లో అసలు ఉండనే ఉండకూడదట . కేవలం అద్దం  మాత్రమే కాదు పగిలిపోయిన సిరామిక్.. పింగాని ప్లేట్లు ఇలాంటివి అస్సలు ఇంట్లో ఉండకూడదట . అది ఏళ్లనాటి శనికి దారితీస్తుందట . ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటే మీరు దరిద్ర దేవతకి వెల్కమ్ చెప్పినట్టే అంటున్నారు  వాస్తు శాస్త్ర పండితులు
. అంతేకాదు ఇంట్లో అవసరానికి మించిన చెత్త చెదారం కూడా పేరుకుపోయేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయట. అలా అనవసరం వస్తువు ఇంట్లో ఉన్న దుమ్ముదులు ఎక్కువగా ఉండడం దోమలు ఈగలు ముసురుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా కొంతమంది డాక్టర్లు కూడా హెచ్చరిస్తూ ఉంటారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: