పెరుగు అనేది మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలలో ఒకటి. ఇందులో ఉన్న ప్రొబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. విటమిన్‌లు, కాల్షియం వంటి పోషకాలతో పరిపూర్ణంగా ఉండే పెరుగు, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది. అయితే పెరుగు ఎంత మంచిదైనా, దాని సరైన వాడకంతోనే దాని ప్రయోజనాలు సంపూర్ణమవుతాయి. కొన్ని ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం కలుగవచ్చు.

వాస్తవానికి, పెరుగు తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అదే సమయంలో, కొన్ని ఆహారాలు వేడి స్వభావం కలిగి ఉంటాయి. వాటిని పెరుగుతో కలిపి తినడం వల్ల శరీరంలో తేడాలు కలుగుతూ, జీర్ణ సంబంధిత సమస్యలు, అసిడిటీ, కడుపునొప్పి వంటి అవాంఛిత ప్రభావాలు కలుగవచ్చు. ఉదాహరణకు, పెరుగుతో మాంసాహారం తీసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఇది అత్యంత తప్పిదమైన ఆచారాలలో ఒకటి. పెరుగు చల్లదనం కలిగి ఉండగా, మాంసాహారం వేడి స్వభావం కలిగి ఉంటుంది. ఇవి రెండూ కలిసి తినడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అలాగే, పెరుగుతో పప్పులు, పులిహోర, ఆమ్ల పదార్థాలు, సిట్రస్ ఫలాలు వంటి ఆహారాలను కలిపి తినడం కూడా మంచిది కాదు. వీటి వల్ల గుండె దడ , మలబద్ధకం, లేదా చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాలలో, పెరుగుతో మిఠాయిలను కలిపి తినడమూ అలర్జీకి దారితీయవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల రాత్రిపూట పెరుగు తీసుకోవడం మంచిది కాదు.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెరుగుతో పాటు వేడి పాలతో తినకూడదు. ఈ రెండు పదార్థాలు విభిన్న స్వభావం కలిగి ఉండి, వాటి కలయిక వల్ల శరీరంలో విషపరిణామాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెరుగును తినే సమయంలో ఏమి తీసుకుంటున్నామో తెలుసుకోవడం, శరీరానికి ఏమి సరిపోతుందో గమనించడం చాలా అవసరం.

సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకునే వారు, పెరుగు మంచిదని అనుకొని దాన్ని ఏ ఆహారంతోనైనా కలిపి తినకూడదు. ఏ ఆహారమైనా సరైన సమయంలో, సరైన విధానంలో తీసుకున్నప్పుడే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేకపోతే, మంచి ఆహారం కూడా అనర్థాలకే దారితీయవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: