లక్ ఉంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది...అదృష్టం బట్టి రాజకీయ నాయకులకు అనూహ్యంగా పదవులు వస్తాయి. ఇప్పుడు ఏపీలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుది కూడా అదే పరిస్తితి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయింది తొలిసారి ఎమ్మెల్యే అయినా సరే అదృష్టం కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అనూహ్యంగా చిత్తూరులో ఈయన కూడా మంత్రి రేసులోకి రావడం కాస్త ఆసక్తికరంగానే ఉంది.

సర్పంచ్ స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన శ్రీనివాసులు...కాంగ్రెస్, ప్రజారాజ్యం, టీడీపీల్లో చక్కర్లు కొట్టి చివరికి వైసీపీలో సెటిల్ అయ్యారు...2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాసులు...2019 ఎన్నికల్లో మరొకసారి పోటీ చేసి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. బలిజ వర్గానికి చెందిన శ్రీనివాసులు...రాజకీయంగా బలపడుతూ వచ్చారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందున్నారు. అలాగే ప్రభుత్వం తరుపున జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం చిత్తూరులో అమలయ్యేలా చూసుకుంటున్నారు.

ఇలా ఎమ్మెల్యేగా పర్వాలేదనిపిస్తున్న శ్రీనివాసులు..జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాటలో ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో సీనియర్లు అయిన రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారు మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్నా సరే, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాసులు సైతం వారికి పోటీగా పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ వైపు పెద్దిరెడ్డి అండ ఎలాగో ఉంది...మరోవైపు బొత్స సత్యనారాయణ ద్వారా కూడా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎలాగో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు...శ్రీనివాసులుకు బంధువు...దీంతో ఆయన ద్వారా కూడా జగన్‌ కళ్ళలో పడాలని ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా మంత్రిగా ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించిన జగన్ అనుకుంటే మంత్రి పదవి చిటికెలో వచ్చేస్తుంది. మరి చూడాలి శ్రీనివాసులుకు మంత్రి అయ్యే అదృష్టం ఉందో లేదో?  

మరింత సమాచారం తెలుసుకోండి: