నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ మూవీ బాలయ్యకి మంచి పేరుని తీసుకువచ్చింది. అంతే కాకుండా తన మార్కెట్ ని మరింతగా పెంచింది. ఇప్పటి వరకూ బాలయ్య చిత్రాలకి మార్కెట్ లో ఇంత డిమాండ్ ఉందా? అనే ఎన్నో డౌట్స్ ని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కలెక్షన్స్ తో ఒక్కసారిగా పటా పంచల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే బాలయ్య ఈసారి ఓ స్కెచ్ తో మరోసారి తన మార్కెట్ ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి విజయాన్ని సాధించటంతో ఈ మూవీని ఇప్పడు మరికొన్ని దేశాల్లో రిలీజ్ చేసేందుకు చూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో కి మరో సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

అందులో భాగంగానే మొదటగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ఇప్పుడు కోలీవుడ్ లో రిలీజ్ చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు. తన మూవీని తమిళనాడులో రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ ఉంటుందని నిర్మాతలకి చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఆలోచించిన నిర్మాతలు సైతం తప్పకుండా ఈ చిత్రాన్ని కోలీవుడ్ లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారంట.

ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు తెలుగు పిరియాడికల్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందుకే కొందరు డిస్ట్రిబ్యూటర్లు శాతకర్ణిని తమిళంలోకి డబ్ చేయిస్తే బాగుంటుందని కూడ భావిస్తుననారు. మొత్తంగా సుమారు 200లకు పైగా స్క్రీన్లలో ఈ చిత్రం కోలీవుడ్ లో రిలీజ్ అవుతుందని సమాచారం. దీంతో బలయ్యకి మూవీ మరో సరికొత్త రికార్డ్ కి రెడీ అవుతుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: