కొన్ని కామెడీ సీన్స్కొన్ని కామెడీ సీన్స్స్క్రీన్ ప్లే, కమర్షియల్ అంశాలు మిస్సింగ్, రొటీన్ కామెడీ
కర్నూల్ సిటీలో 5000 కోట్ల ఆస్తి కలిగిన వరలక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఓ జర్నలిస్ట్ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఆమె తరపున వాదించడానికి క్రిమినల్ లాయర్ చక్రవర్తి (మురళి శర్మ)ని తీసుకుంటుంది. ఇదిలాఉంటే అదే కోర్ట్ లో కాంప్రమైజ్ వకీల్ గా రామకృష్ణ (సందీప్ కిషన్) ఉంటాడు. కొన్ని కారణాల వల్ల వరలక్ష్మి కేసు రామకృష్ణ చేతికి వస్తుంది. ఇంతకీ తెనాలి రామకృష్ణ ఈ కేసు ఎలా వాదించాడు..? రామకృష్ణ కేసు గెలిచాడా..? అన్నది సినిమా కథ.



సందీప్ కిషన్ రామకృష్ణ పాత్రలో మెప్పించాడని చెప్పాలి. అయితే నటన పరంగా బాగున్నా డైరక్టర్ అతన్ని సరిగా వాడుకోలేదు. హీరోయిన్ హాన్సిక పెద్దగా ఇంపార్టెంట్ ఉన్న పాత్ర చేయలేదు. వరలక్ష్మి శరత్ కుమార్ ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. పోసాని, వెన్నెల కిశోర్, జబర్దస్త్ చమ్మక్ చంద్ర మిగతా వారంతా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.



సాయి కార్తిక్ మ్యూజిక్ సోసోగానే ఉంది.. బిజిఎం కూడా ఏదో అలా నడిపించేశాడు. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. సినిమా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి కథ పర్వాలేదు అన్నట్టుగా రాసుకున్నా కథనం మాత్రం రొటీన్ ఫార్మెట్ లో సాగించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.



తన సినిమాలతో కితకితలు పెట్టించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దర్శకులలో జి నాగేశ్వర్ రెడ్డి ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా తెనాలి రామకృష్ణ. సినిమా కథ పర్వాలేదు అన్నట్టుగా ఉన్నా కథనం విషయంలో దర్శకుడు రొటీన్ ఫార్మెట్ లో తీసుకెళ్లాడు.  ఫస్ట్ హాఫ్ కాస్త కూస్తో బెటర్ గా ఉన్నా సెకండ్ హాఫ్ లో కాస్త ఇబ్బందిగా అనిపించింది.


కోర్ట్ సీన్ చాలా అతి అనిపిస్తుంది. అయితే ఆడియెన్స్ కనెక్ట్ అయిన విధానాన్ని బట్టి సినిమా ఫలితం ఉంటుంది. నిను వీడని నీడని నేను తో డీసెంట్ హిట్ అందుకున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకున్నాడు. కాని సినిమా ఎక్కడ అంచనాలను అందుకోలేదు. టీజర్, ట్రైలర్ కొద్దిగా బెటర్ అనిపించగా సినిమాలో కామెడీ అంతగా మెప్పించలేదని చెప్పాలి.


కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కేవలం కొంతమంది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీశారని చెప్పొచ్చు. మాస్ యాక్షన్ అంశాలు.. వెరైటీ కథ, కథనాలు చూసే వారికి ఈ సినిమా రుచించదు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా పెదవివిరిచేలా ఉందని చెప్పొచ్చు.



సందీప్ కిషన్, హాన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్ తెనాలి రామకృష్ణ.. రొటీన్ కామెడీ మూవీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: