ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్ విడాకులు తీసుకున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెళ్లైన సరిగ్గా ఏడాదికే శ్వేతా తన భర్తతో విడిపోయారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 'కొత్త బంగారులోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్వేత.. సినిమాల్లేక సెక్స్ రాకెట్‌లో చిక్కుకున్న సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

 

బిజినెస్ మాన్ రోహిత్ మిట్టల్‌ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్న రోహిత్-శ్వేత 2018 డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. తొలి పెళ్లి రోజు జరుపుకోవడానికి సరిగ్గా మూడు రోజులు ఉందనగా వీళ్ళు విడిపోవడం బాధాకరం. ఈ విషయాన్ని శ్వేత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'హాయ్, రోహిత్ నేను పరస్పరం మాట్లాడుకుని విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా ఇద్దరం సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్నాం. కానీ పరిష్కారం అవ్వలేదు. పుస్తకంలోని ప్రతీ పేజీని చదవకపోయినంత మాత్రాన ఆ పుస్తకం చెడ్డదని కాదు. కొందరు చదవలేక కొన్ని విషయాలను తెలుసుకోకుండా మిగిలిపోవచ్చు. చెరిగిపోని జ్ఞాపకాలను మిగిల్చినందుకు, నాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు రోహిత్. నీ జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటూ నీ చీర్‌లీడర్' అని తెలిపింది.

 

అయితే శ్వేత తన భర్తతో విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం తెలపలేదు. అయితే ఒకప్పుడు శ్వేత సెక్స్ రాకెట్‌లో దొరికిపోయిన సంఘటన చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అందుకే విడిపోయి ఉంటారని బాలీవుడ్ వర్గాల సమాచారం. పెళ్లి తర్వాత కూడా శ్వేత సినిమాల్లో నటిస్తానని అనుంటారని, అందుకు అత్తింవారు ఒప్పుకోకపోవడంతో విడిపోయి ఉండొచ్చిన కూడా వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. 

 

'కహానీ ఘర్ ఘర్ కీ' అనే సీరియల్‌తో బాల నటిగా పరిచయమైన శ్వేతా బసు.. తెలుగులో 'కొత్తబంగారు లోకం' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత శ్వేతా మరీ బొద్దుగా తయారవడంతో సరైన అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 'కళవర్ కింగ్' అనే సినిమాలో నటించినా ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. సినిమా అవకాశాలు లేక, బతకడానికి డబ్బు లేక సెక్స్ రాకెట్ లో ఇరుక్కొని మీడియాకి దొరికింది. అది కాస్తా వైరల్ అవడంతో ఆ పనిని వదిలేసి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ చిన్న చిన్న సినిమాలు, తర్వాత 'బద్రీనాథ్ కీ దుల్హనియా' అనే సినిమాలో వదిన పాత్రను చేశారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని అనుకున్నారు. మరి ఇంతలో ఏమైందో గాని వైవాహిక జీవితంకూడా చెల్లా చెదరైపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: