హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన హీరో నిఖిల్, యువత సినిమాతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రొటీన్ చిత్రాల్లో నటించి ఫ్లాపుల్ని మూటగట్టుకున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన స్వామిరారా సినిమాతో హిరో నిఖిల్ పూర్తిగా మారిపోయాడు. అప్పటి నుండి కాన్సెప్ట్ బేస్డ్ కథల్ని ఎంచుకుంటూ హిట్ల మీద హిట్లు కొడుతూ వెళ్తున్నాడు. ప్రస్తుతం అర్జున్ సురవరం సినిమాతో డీసెంట్ హిట్ అందుకుని చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 కి సిద్ధమవుతున్నాడు.

 

నిజానికి నిఖిల్ హీరో అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. డైరెక్టర్ అవుదామనుకుని వచ్చి హీరో అయ్యాడు. అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం తనలోని రచయితని చూపించబోతున్నాడు. హీరోలు తమ సినిమాలకి కథ రాసుకోవడం చాలా అరుదు. తెలుగులో అయితే అడవి శేష్ తన చిత్రాలకి తానే కథ రాసుకుని వరుస విజయాలని దక్కించుకుంటున్నాడు. అతడు కథ అందించిన క్షణం, గూఢాచారి చిత్రాలు ఎంతలా సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

 

ఇక మొన్నటికి మొన్న సిద్ధు జొన్నలగడ్డ క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రానికి కథ, కథనం లో పాలు పంచుకున్నాడు. ఇలా హీరోలు రచయితలుగా మారడం చాలా అరుదు. అయితే హీరో నిఖిల్, తనలోని రచయితని బయటకి తీస్తున్నాడు. లాక్డౌన్ టైమ్ లో ఆన్ లైన్ ఫిలిమ్ మేకింగ్ కోర్సు తీసుకున్న నిఖిల్, తనలోని దర్శకుడిని మరికొద్ది రోజుల్లో మనకి పరిచయం చేయబోతున్నాడు. ఈ మేరకు అడ్వెంచరస్ కథని సిద్ధం చేస్తున్నానని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. మరి హీరోగా సక్సెస్ ఫుల్ గా దూసుకువెళ్తున్న నిఖిల్, దర్శకుడిగా ఎప్పుడు కనిపిస్తాడో..

 

ఇదిలా ఉంటే కార్తికేయ 2 సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో 18 పేజెస్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. సుకుమార్ అందించిన ఈ కథని కుమారి 21 ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో నిఖిల్ మతిమరుపు మనిషిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం హీరోయిన్ కోసం వెతుకుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: