టాలీవుడ్ లో హీరోగా, కమెడియన్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన చంద్రమోహన్ అందరికీ సుపరిచితమే. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గర అయినా చంద్రమోహన్ ఆ తర్వాత తన వయసుకు తగ్గ ట్రెండ్ కు తగ్గ పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అప్పట్లో టాప్ హీరో లైన కృష్ణ, శోభన్ బాబు వంటి వారితో పోటాపోటీగా సినిమాలు చేసి తాను కూడా స్టార్ హీరోగా ఎదిగాడు.

ఈయన సరసన నటించిన చాలా మంది హీరోయిన్ లు, శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి వారు టాప్ హీరోయిన్స్ గా ఎదిగారు. ప్రస్తుతం 81వ వసంతంలోకి అడుగు పెట్టిన ఆయన శోభన్ బాబు ని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చాడని చాలా సందర్భాల్లో తెలిపారు. చంద్రమోహన్ దాదాపు యాభై ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో వివిధ పాత్రలు పోషించినప్పటికీ ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ వహించడం లేదని చెప్పారు. దాదాపు 932 సినిమాల్లో నటించిన చంద్రమోహన్ నాలుగు తరాల తారలతో నటులతో నటించారు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.

ఇక చంద్ర మోహన్ పర్సనల్ విషయానికి వస్తే ఆయన 1952 మే 23 న కృష్ణా జిల్లా కు చెందిన మారుమూల గ్రామం లో జన్మించారు. వ్యవసాయ కళాశాల బాపట్ల బీఎస్సీ పూర్తి చేసి కొంతకాలం ఏలూరు లో పనిచేశాడు సినిమాలలోకి నటించాలనే ఉత్సాహం తో మద్రాస్ చేరి ప్రయత్నించగా రంగులరాట్నం చిత్రంతో ఆయన తన కెరీర్ ని మొదలు పెట్టాడు. ఈయన భార్య పేరు జలంధర. ఈమె కూడా మంచి రచయిత్రి. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా వారిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకుని వారి జీవితాలలో సెటిలైపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: