టాలీవుడ్ లో జేమ్స్ బాండ్ తరహా సినిమాలు చేసిన ఒకే ఒక్క హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెర మీదే కాదు ఇండియన్ స్క్రీన్ మీదే జేమ్స్ బాండ్ అనగానే అందరు కృష్ణ గారి పేరే చెబుతారు. ఇంతకీ కృష్ణ జేమ్స్ బాండ్ బ్రాండ్ ఏర్పరచుకోడానికి వెనక జరిగిన కథ ఏంటన్నది చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అప్పటికే తేనే మనసులు సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణ ఆ సినిమాలో ఓ ఛేజ్ సీన్ లో నిర్మాత డూండీని మెప్పించడంతో జేమ్స్ బాండ్ ఛాన్స్ కృష్ణకి వచ్చింది. తేనే మనసులు సినిమాలో కారుని బైక్ తో ఛేజ్ చేసే సీన్ లో బైక్ పై నుండి కారులోకి దూకారట కృష్ణ. ఆ సన్నివేశం చూసిన నిర్మాత డూడీ జేమ్స్ బాండ్ గా కృష్ణ పర్ఫెక్ట్ అని ఆయన్ను ఫిక్స్ చేశారట.

కృష్ణతో పాటుగా రామ్మోహన్ ను కూడా జేమ్స్ బాండ్ పాత్రకు అనుకున్నారట కాని కృష్ణకు మాత్రమే ఆ ఛాన్స్ వరించింది. కృష్ణ నటించిన మూడవ సినిమా గూఢచారి 116. ఈ సినిమాను నిర్మాత డూండీ పానిక్ ఇన్ బ్యాంకాక్ అనే సినిమా ఫీమేక్ గా తెరకెక్కించారు. గూఢచారి 116 సినిమాకు ఆరుద్ర రచించగా మల్లిఖార్జున రావు డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో జేమ్స్ బాండ్ పాత్రలో కృష్ణ పర్ఫెక్ట్ గా సూటయ్యారు. ఆ సినిమా హిట్ అవడంతో అప్పటి నుండి టాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో కృష్ణ చాలా పాపులర్ అయ్యారు.

తెలుగులో జేమ్స్ బాండ్ అంటే కృష్ణ గారే అని చెప్పుకునేలా ఆయన సినిమాలు చేశారు. అయితే కృష్ణ వారసుడు మహేష్ కూడా ఆ తరహా కథలను ప్రయత్నించారు. టక్కరి దొంగ సినిమా బాండ్ తరహాలో ప్రయత్నించిన మహేష్ ఆ సినిమాతో అపజయాన్ని మూటకట్టుకున్నాడు. అందుకే మళ్లీ మహేష్ ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్లలేదు. కాని ఎప్పటికైనా మహేష్ జేమ్స్ బాండ్ తరహా కథలో చూడాలని అనుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మహేష్ రాజమౌళి సినిమా జేమ్స్ బాండ్ కథతోనే వస్తుందని టాక్. అదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: