కొద్ది రోజుల క్రితం సుశాంత్ అక్కినేని హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను లాంఛనంగా నిర్వహించారు. అయితే ఈచిత్రం ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అల వైకుంఠపురములో సినిమాతో సుశాంత్.. త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ సన్నిహిత్యం తోనే త్రివిక్రమ్ ప్రశాంతి సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఆయన స్పీచ్ సోషల్ మాధ్యమాల్లో కూడా వైరల్ గా మారింది. ఈ లెవెల్ లో మాటల మాంత్రికుడు ప్రమోషన్ చేస్తే ఇంకా సినిమాకి హై పెరగకుండా ఉంటుందా? అని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇదే వేదిక మీద వేరొక సినిమాని కూడా చాలా చాకచక్యంగా ప్రమోట్ చేశారు త్రివిక్రం శ్రీనివాస్. ఈ వేదికపై యాంకర్ సుమ అవసరాల శ్రీనివాస్ పేరును ప్రస్తావించారు. శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అందగాడు సినిమాల్లో బట్టతల వేషంలో కనిపించబోతున్నారని ఆమె పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అవసరాల శ్రీనివాస్ గురించి ప్రస్తావిస్తూ అతని సినిమాని బాగా ప్రమోట్ చేశారు. దాంతో అవసరాల శ్రీనివాస్ త్రివిక్రమ్ చెప్పిన మాటలను వీడియో క్లిప్ రూపంలో సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమోషన్ స్కిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  ఇకపోతే కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన 101 జిల్లాల అందగాడు సినిమా సెప్టెంబర్ 3వ తేదీన రిలీజ్ కానుంది. ఇచట వాహనములు నిలుపరాదు సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా చాలా రొటీన్ గా ఉందని.. పాత కథలతోనే మళ్లీ సినిమా తీసినట్లు ఉందని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: