ప్రపంచంలో ఒకేలా పోలికలు ఉండే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటూ ఉంటారు. చాల సందర్భాలలో అలాంటి మనుషులను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఫిలిం సెలెబ్రెటీలు ధనుష్ ప్రభాస్ మహేష్ చిరంజీవి లాంటి మనుషులకు సంబంధించిన ఫోటోలు తరుచు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.


ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారకరామారావు లా కనిపించే రికార్డింగ్ డాన్స్ ఆర్టిస్టులు హడావిడి చేసిన సందర్భాలు కూడ ఉన్నాయి. అయితే అచ్చం ఒక టాప్ హీరోయిన్ లా పోలికలు ఉన్న అమ్మాయిలు చాల అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి సందర్భమే ఒకటి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె రూపురేఖలు తో కనిపించే ఒక అమ్మాయి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కలకత్తా కు చెందిన రిజుతా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె లుక్ అదేవిధంగా ఆమె కళ్ళు అచ్చు దీపికా పదుకొనె రూపురేఖలతో కన్పించడంతో ఇన్ ష్టా గ్రామ్ లో ఉన్న ఆమె ఎకౌంట్ కు సుమారు లక్షకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు అని తెలుస్తోంది.


మరికొండరైతే ఫోటోలను చూసి ఆమెతో సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేస్తూ ‘మీరు దీపిక పదుకొనే కు కజిన్ అవుతారా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. వాస్తానికి రిజుతా మాత్రం దీపిక పదుకొనే ను ఇప్పటివరకు ఒక్కసారి కూడ కలవలేదట. అయితే తన ఫాలోయర్స్ ఆమెను దీపికతో పోలుస్తూ ఉండటంతో ఆమె ఆనందపడుతూ మరింత యాక్టివ్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈమెకు ఫాలోయర్స్ కూడ రోజురోజుకి పెరగడం మరింత ఆశ్చర్యంగా మారింది. ఈ వ్యవహారాన్ని ఫాలో అవుతున్న కొందరు నెటిజన్ లు రిజుతా ను దీపికా పదుకొనే 2.0 అంటూ కామెంట్స్ కూడ పెట్టడం ఆశ్చర్యంగా మారింది..
ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనేక కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: