తెలుగు సినీ ఇండస్ట్రీకి మల్లీశ్వరి సినిమా ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా కైఫ్ బాలీవుడ్లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంది.  తన ప్రియుడు తనకంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది. . ఇకపోతే వివాహం తర్వాత ఈ జంట ఎవరికి వారు తమ సినీ కెరియర్లో బిజీగా తమ లైఫ్ ను కొనసాగిస్తున్నారు.  ఇదిలా ఉండగా కత్రినా కూడా ప్రస్తుతం వివాహం తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉందని చెప్పవచ్చు. సినీ కెరియర్ పరంగా బిజీగా ఉండే కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువలో ఉంటుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ కి సంబంధించి అలాగే తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కూడా అందిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోని కత్రినా కైఫ్ విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కత్రినా కైఫ్ ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో స్వెటర్ తో పాటు డెనిమ్ జీన్స్ కూడా ధరించింది ఈ ముద్దుగుమ్మ.

మత్తెక్కించే హావభావాలతో.. చూడచక్కని అందంతో.. ఆకట్టుకునే చూపులతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తూ సెగలు పుట్టిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇకపోతే ఈ ఫోటోలు ఈమె ధరించిన స్వెటర్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ  స్వెటర్ ధర  445 డాలర్లట. ఇక మన ఇండియన్ కరెన్సీ ప్రకారం.. అక్షరాల రూ.35,000.. ఇక దీని ధర తెలిసి నేటిజనుల సైతం నోరెళ్ళ పెడుతున్నారు. ఎందుకంత ధర అనే విషయానికి వస్తే 100% పాలిస్టర్ తో తయారు చేసిందట. అంతేకాదు మల్టీకలర్ స్వెటర్ కావడం డిఫరెంట్ అల్లిక కావడంతో ఈ స్వెటర్ అంత ధర చేస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: