టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ప్రభాస్మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా , కృతి సనన్మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ లో వి ఎఫ్ ఎక్స్ పనులు అత్యధికంగా ఉండడం వల్ల  ,ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా నిర్వహిస్తోంది.

కొంత కాలం క్రితం ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఈ మూవీ ని చిత్ర బృందం సంక్రాంతి భరి నుండి తప్పించింది. అందుకు కారణం ఈ మూవీ కి అత్యధికంగా వి ఎఫ్ ఎక్స్ ఉండడం అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు కలిగి ఉన్నాయి. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క అన్ని భాషల ఓవర్సీస్ హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ దక్కించుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా , ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం  ప్రభాస్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను కూడా విడుదల చేయగా ,  వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: