తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా తునివు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళం లో రూపొందిన ఈ మూవీ ని తెలుగు లో తెగింపు పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాను జనవరి 11 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా , బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మించాడు. మంజు వారియర్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు లభిస్తున్నాయి. తెగింపు మూవీ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను  కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ఈ 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

తెగింపు మూవీ కి 12 రోజుల్లో నైజాం ఏరియాలో 1.76 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ లో 51 లక్షలు ,  ఆంధ్ర లో 1.78 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.07 కోట్ల షేర్ , 4.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి.
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 1.53 కోట్ల షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితే ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా తెలుస్తోంది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: