తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం బింబిసారా అనే మూవీ తో బ్లాక్ పాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా బింబిసారా మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న కళ్యాణ్ రామ్ తాజాగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎమిగోస్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో కళ్యాణ్ రామ్ త్రిపాత్ర అభినయంలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని ఫిబ్రవరి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి మూవీ సంస్థ నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ సంస్థ ఈ సంవత్సరం బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.
\
ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు విజయాలను అందుకున్న ఈ బ్యానర్ నుండి ఈ సంవత్సరం వస్తున్న వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఈ చిత్ర బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 9 కోట్లకు ఈ చిత్ర బృందం అమ్మినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: