తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ కొన్ని రోజుల క్రితమే వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రూపొందిన వారిసు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా  తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు . దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ లో శ్రీకాంత్ విజయ్ కి సోదరుడి పాత్రలో నటించాడు .

మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ కి తెలుగు లో కూడా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ తమిళ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 67 వ మూవీ గా రూపొందుతూ ఉండడం , ఈ సినిమాకు ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తలపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ప్రోమో వీడియోను ఫిబ్రవరి 3 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలను కూడా ఈ చిత్ర బృందం మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: