మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా , మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. బాబి సింహ , ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా , క్యాథరిన్ ఈ సినిమాలో రవితేజ కు భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. మరి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , 2 వ రోజు 11.95 కోట్లు , 3 వ రోజు 12.61 కోట్లు , 4 వ రోజు 11.42 కోట్లు , 5 వ రోజు 8.80 కోట్లు , 6 వ రోజు 7.33 ,  7 వ రోజు 4.85 కోట్లు ,  8 వ రోజు 3.85 కోట్లు , 9 వ రోజు 4.66 కోట్లు , 10 వ రోజు 6.66 కోట్లు , 11 వ రోజు 1.90  కోట్లు , 12 వ రోజు 1.20 కోట్లు , 13 వ రోజు 69 లక్షలు , 14 వ రోజు 2.11 కోట్లు , 15 వ రోజు 73 లక్షలు , 16 వ రోజు 1.08 కోట్లు , 17 వ రోజు 2.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో 112.25 కోట్ల షేర్ , 181.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: