దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని ఆ అభిమానంతోనే అతడు తీసిన ‘గబ్బర్ సింగ్’ ఘనవిజయం సాధించడంతో పవన్ అభిమానులు అతడిని ఎంతో ఇష్టపడతారు. ఆతరువాత సందర్భం వచ్చినప్పుడల్లా పవర్ స్టార్ అభిమానులు హరీష్ శంకర్ ను తమ హీరోతో మరో బ్లాక్ బష్టర్ ఎప్పుడు తీస్తావు అంటూ చాల అభిమానంగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉండేవారు.


కొంతకాలం క్రితం హరీష్ శంకర్ పవన్ తో ‘భవధీయుడు భగత్ సింగ్’ అన్న సినిమాను తీస్తున్నట్లుగా ప్రకటన చేయగానే పవన్ అభిమానుల ఊహలు ఆకాశం అంత స్థాయికి చేరుకొని ఆసినిమాతో పవన్ కు మరో బ్లాక్ బష్టర్ హిట్ ఖాయం అంటూ కలలలో విహరించారు. ఆతరువాత ఆ టైటిల్ ను మార్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అన్న టైటిల్ తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించగానే పవన్ అభిమానులలో కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి.


ఆతరువాత హరీష్ శంకర్ ఈమూవీ తమిళ సినిమా ‘ధేరీ’ రీమేక్ గా తీస్తున్నట్లు లీకులు ఇవ్వగానే అతడి పై పవన్ అభిమానులకు కోపం పెరిగి అతడిని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. తన పై జరుగుతున్న నెగిటివ్ కామెంట్స్ కు కలత చెందిన హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాల విభిన్నంగా స్పందించాడు. ‘పవన్ అభిమానులను నా సోదరులుగా భావిస్తాను. అయితే ఈమధ్య కాలంలో వారు హద్దులు మీరి నన్ను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ చూసి బాధ పడుతున్నాను. దీనితో ఒక నిర్ణయం తీసుకున్నాను.


నేను పవన్ తో తీయబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించిన ఆఫ్ డేట్స్ ను పవన్ అభిమానులతో షేర్ చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను’ అంటూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. త్వరలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ వారాహి యాత్రను మొదలుపెట్టబోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్మూవీ మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: