తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం బింబిసారా అనే మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా బింబిసారా మూవీ తో ఫుల్ ఫామ్ లో ఉన్న కళ్యాణ్ రామ్ తాజాగా ఏమిగోస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ త్రిపత్రాభినయంలో నటించాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో ప్రస్తుతం మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నా ఈ మూవీ కి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించగా , ఈ మూవీ ని మైత్రి మూవీ సంస్థ నిర్మించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.  

మూవీ యొక్క ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ పై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: