తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా సినిమాని థళపతి 67 అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ యూనిట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ లాంచ్‌ను కూడా చిత్ర యూనిట్ చాలా ఘనంగా నిర్వహించగా, తాజాగా ఈ సినిమా టైటిల్‌ను కూడా రివీల్ చేసింది చిత్ర యూనిట్.యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మరోసారి తనదైన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఈ టైటిల్ రివీల్ ప్రోమో వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతోంది. లోకేశ్ మార్క్ హీరో ఎలివేషన్‌తో ఈ టైటిల్ రివీల్ ప్రోమోను కట్ చేయడంతో తలపతి విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దూసుకొస్తున్న విలన్లకు చుక్కలు చూపించేందుకు హీరో ఓ కత్తిని చాక్లెట్ క్రీమ్‌లో ముంచి తీసి, తన వేలితో టేస్ట్ చేస్తాడు. 


బ్లడీ స్వీట్ అంటూ తలపతి విజయ్ చెప్పడంతో ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు చిత్ర యూనిట్. ఇంకా ఈ సినిమాకు 'లియో' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మూవీ యూనిట్ లాక్ చేసింది.ఇలా విజయ్ నటిస్తున్న తన 67వ సినిమాకి సంబంధించిన టైటిల్‌ను లోకేశ్ కనగరాజ్ రివీల్ చేసిన విధానం ప్రేక్షకుల్లో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు  తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోండగా, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే 19.10.23 అని రిలీజ్ డేట్ ని ప్రకటించడమే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో విడుదల కాబోతుందని రివీల్ చేశారు. ఇక మాస్టర్ సినిమాతో విజయ్ ని ఒక రేంజిలో ఎలివేట్ చేసి ఫ్యాన్స్ ని మెప్పించిన లోకేష్ ఈ సినిమాలో విజయ్ ఇంకెంత బాగా ఎలివేట్ చేస్తాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: