కలర్ ఫోటో సినిమాతో మొదటిసారిగా హీరోగా మారిన సుహాన్ బాగానే పేరు సంపాదించారు. తాజాగా రైటర్ పద్మభూషణ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాల కీలకమైన పాత్రలో కనిపించిన గౌరీ ప్రియా రెడ్డి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తన అందం అభినయంతో అందరిని మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కోసం నేటిజన్లు సైతం తెగ వెతికేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అమ్మాయి ఎవరు ముందు ఏ సినిమాలో నటించిందనే విషయాన్ని ఎక్కువగా వెతుకుతున్నారు. మొదట మెయిల్ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయే కావడం గమనార్హం. తెలుగు అమ్మాయి అయ్యిండి సినీ పరిశ్రమలు రాణించడం అందులోనూ హీరోయిన్గా నిలదకు పోవడం అంటే అది చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. మెయిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఆమె ఎక్కడ కనిపించలేదు. తాజాగా రైటర్ పద్మభూషణ్ చిత్రంలో కనిపించి ప్రేక్షకులను బాగా అదరించింది సినిమా కథ మొత్తానికి మార్చే పాత్రలో ఇమే నటించింది. రైటర్ పద్మభూషణ్ సినిమాలు సుహాన్ టీనా శిల్పరాజు పాత్రలతో సమానంగా గౌరీ ప్రియ తన పాత్రతో ప్రశంశాలు అందుకుంది.
గౌరీ ప్రియా రెడ్డి తెలుగు అమ్మాయి కావడంతో ఈమె గురించి తెలుగు ప్రేక్షకులు తెలుసుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా చిన్న వయసులోనే బోల్ బేబీ బోల్ షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది గౌరీ ప్రియా రెడ్డి. నటన మీద ఆసక్తితోనే నటన వైపు అడుగులు వేసింది ఈ క్రమంలోని సినిమాలలో అవకాశాలు రావడంతో పలు చిత్రాలలో నటించింది. కేవలం సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్గానే ఉంటుంది. గౌరీ ప్రియా రెడ్డి సింగర్ గా కూడా టాలెంట్ ఉన్నట్లు తెలుస్తోంది అలాగే 2018లో మిస్ హైదరాబాద్ కిరీటాన్ని కూడా గెలుచుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: