టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య పోయిన సంవత్సరం ఏకంగా 3 మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో నాగార్జున తో కలిసి నటించిన బంగార్రాజు మూవీ మంచి విజయం సాధించగా అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన హిందీ సినిమా లాల్ సింగ్ చడ్డ ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. ఈ రెండు మూవీ లతో పాటు చైతన్య సోలో గా థాంక్యూ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది.

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే మూవీ లో హీరోగా నటించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ... అరవింద స్వామి ... ప్రియమణిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ లో హీరో గా నటించిన నాగ చైతన్య ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించినట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క టీజర్ ను మార్చి 16 వ తేదీన సాయంత్రం 4 గంటల 51 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: