శ్రీరామనవమి రోజున విడుదలకాబోతున్న ‘దసరా’ టిక్కెట్లకు బుక్ మై షో యాప్ లో వస్తున్న స్పందన చూస్తుంటే ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ నాని కెరియర్ లోనే ది బెస్ట్ గా ఉంటాయి అన్నసంకేతాలు వస్తున్నాయి. ఈమూవీ టిక్కెట్లకు ఓవర్సీస్ లో కూడ మంచి స్పందన వస్తోందని వార్తలు వస్తున్నాయి.


లేటెస్ట్ గా ఈసినిమాను చూసిన సెన్సార్ వర్గాలు ఈమూవీలోని చాల బూతు డైలాగ్ లను మ్యూట్ చేయమన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే మరీ భయంకరంగా ఉన్నాయని అవి భరించడం కష్టం అని సెన్సార్ బోర్డ్ సభ్యులు అభిప్రాయపడినట్లు లీకులు వస్తున్నాయి. ముఖ్యంగా బాడ్ కవ్ బెంచత్ వంటి బూతులను తొలగించాలని సెన్సార్ కోరినట్లు తెలుస్తోంది.


అంతేకాదు ఈమూవీలోని కీలకపాత్ర అయిన సూరి పాత్ర చనిపోయాక డెడ్ బాడీ ను చూపించే షాట్ పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పిందట. ఈపాత్రను దీక్షిత్ శెట్టి చేసాడు. ఈపాత్ర చుట్టూనే ఈమూవీ కథ తిరుగుతుందని సమాచారం. సెన్సార్ కట్స్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాకు లీక్ అవ్వడంతో ఈమూవీలో బూతుల పురాణం ఎక్కువగా ఉంటుందా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈమూవీకి ప్రస్తుతం ఏర్పడిన పాజిటివ్ ట్రెండ్ పరిశీలిస్తే కలక్షన్స్ విషయంలో ఈమూవీ సంచలనాలు సృష్టించడం ఖాయం అంటూ నాని అభిమానులు ఒక అంచనాకు వచ్చారు.


పాన్ ఇండియా మూవీగా విడుదలకాబోతున్న ఈమూవీకి హిందీలో మాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో బాలీవుడ్ ప్రేక్షకులలో క్రేజ్ ఏర్పడలేదు అంటున్నారు. మరికొందరైతే ఈమూవీ కథలో వెరైటీ కనిపించకపోతే సగటు ప్రేక్షకుడుకి మళ్ళీ ‘రంగస్థలం’ మూవీ చూసినట్లు అనిపించే ఆస్కారం ఉంది అన్న మాటాలు వస్తున్నాయి. నాని కీర్తి సురేష్ లు హిట్ పదం విని కొన్ని సంవత్సరాలు అయింది. ఈమూవీలో కీర్తి సురేష్ నటన ‘మహానటి’ రేంజ్ లో ఉంటుందని నాని అంటున్నాడు. తెలంగాణ భాషను స్వయంగా నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న కీర్తి సురేష్ కష్టానికి ఎంతవరకు ఫలితం దక్కుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: