నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... నాని కి జోడిగా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన నేను లోకల్ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో వీరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

అలా ఇప్పటికే ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్న ఈ జోడి మరో సారి దసరా మూవీ లో కలిసి నటించడంతో వీరిద్దరి జంట ఈ సినిమాలో ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే దసరా మూవీ కి శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించగా ... సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ బృందం పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే సెన్సార్ సభ్యులు ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు వారు 36 సెన్సార్ కట్స్ వీధించినట్లు తెలుస్తోంది. అలాగే ఇది తెలుగు సినిమాలోనే హైయెస్ట్ సెన్సార్ కట్స్ ఉన్న సినిమాగా కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: