ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించిన యంగ్ హీరోలలో ఎక్కడా బయటకు ఇగో ని కనపడనీయకుండా సీనియర్ హీరోలకు గౌరవాన్ని ఇస్తూ విలక్షణమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్న హీరోల లిస్టులో రామ్ చరణ్ చాల ముందు  వరసలో కొనసాగుతున్నాడు. లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగిన నందమూరి తారకరామారావు శతజయంతి సభకు యంగ్ హీరోలు ఎవరు రాకపోయినప్పటికీ రామ్ చరణ్ ఆ ఫంక్షన్ కు రావడమే కాకుండా ఆ ఫంక్షన్ ను నిర్వహించిన బాలకృష్ణ పై ప్రశంసలు కురిపిస్తూ చరణ్ మాట్లాడిన తీరుపై ఇండస్ట్రీలోని అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

 

ఈ ఫంక్షన్ గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా అందరు చరణ్ మాట్లాడిన పద్ధతి గురించి మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఈ ఫంక్షన్ కు రమ్మని జూనియర్ ఎన్టీఅర్ కు ఆహ్వానం పంపినప్పటికీ అప్పటికే తన ట్రిప్ ఫైనల్ కావడంతో తాను రాలేకపోతున్నాను అంటూ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జూనియర్ తలుచుకుంటే ఈ ఫంక్షన్ కు రావడం అంత పెద్ద కష్టం కాదనీ తన తాత ఫంక్షన్ కంటే అతడి ట్రిప్ ఎక్కువా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

 వాస్తవానికి చరణ్ జూనియర్ లు చాల సన్నిహిత స్నేహితులు ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించిన తరువాత వారి స్నేహం మరింత పెరిగింది అని అంటారు. వాస్తవానికి చరణ్ తన స్నేహితుడు జూనియర్ రావడంలేదని తెలుసుకుని ఈ ఫంక్షన్ కు డుమ్మా కొట్టవచ్చనీ అయితే బాధ్యతగా ఈ ఫంక్షన్ కు రావడమే కాకుండా అందరితోను ముఖ్యంగా బాలకృష్ణ తో చరణ్ ప్రవర్తించిన తీరు చాల హుందాగా ఉంది అంటూ ప్రశంసలు వస్తున్నాయి.

 

 ప్రభాస్ మహేష్ అల్లు అర్జున్ లతో పాటు అనేకమంది యంగ్ హీరోలకు ఈ ఫంక్షన్ కు రావలాసిందిగా ఆహ్వానాలు పంపినప్పటికీ వారంతా రకరకాల కారణాలతో ఈ ఫంక్షన్ కు డుమ్మా కొట్టారు. ఇక సేనియర్ హీరోలు చిరంజీవి మోహన్ బాబు నాగార్జున కూడ ఈ ఫంక్షన్స్ కు దూరంగా ఉన్నారు. అయితే తన వయసు రీత్యా ఎన్టీఆర్ తో ఏమాత్రం పరిచయంలేని రామ్ చరణ్ ఎన్టీఆర్ ను  ఆకాశంలోకి ఎత్తివేయడం ఒక్క చరణ్ కు మాత్రమే సాద్యం అయింది..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: