గత కొద్ది కాలంగా మహిళలకు అన్ని విభాగాల్లో అర్హత కల్పించాలన్నది ధ్యేయంగా, ప్రభుత్వ సంస్థలన్నీ మహిళలకు 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలో ఆడవాళ్లకు భద్రత కల్పించడం కోసం వారిలో ఉన్న ప్రతిభ, పనితనం బయట ప్రపంచాలకు తెలియడం కోసం ఇప్పుడు సరికొత్తగా వినూత్నంగా రిక్రూట్మెంట్ నిర్వహించింది. ఇది కేవలం మహిళలకు మాత్రమే అంటూ చెబుతోంది ఒక టెక్ దిగ్గజ సంస్థ అదేంటో మనం కూడా తెలుసుకుందాం..


భారతీయ టెక్ దిగ్గజం అయినటువంటి టీసీఎస్ మహిళా అభ్యర్థులకు ఒక శుభవార్త తెలిపింది. రకరకాల కారణాల వల్ల కెరియర్ గ్యాప్ వచ్చి, ఇప్పుడు ఉద్యోగం చేయాలనుకునే  అలాంటి మహిళల కోసం సరికొత్తగా రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ , డిగ్రీ పూర్తి చేసిన మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా అనుభవం, ప్రతిభ ఉన్న మహిళలు టిసిఎస్లో ఉద్యోగం పొందడానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా టీసీఎస్ ప్రతినిధి తెలిపారు.


అంతేకాకుండా ఫ్రెషర్స్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ కంపెనీ లో ఉద్యోగం పొందడానికి టీసీఎస్ అధికారిక వెబ్ సైట్లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. మహిళలు క్రమశిక్షణతో తమ సంస్థలను మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆలోచనతోనే టీసీఎస్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త గా మారుతున్న ఈ ప్రపంచంలో నేర్చుకోవడం అనేది ఎప్పటికీ కొత్తగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళా తమ సంస్థలో భాగం అవ్వాలని వారు ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా రెండేళ్ల నుంచి ఐదు సంవత్సరాల వరకు అనుభవం కలిగిన మహిళలు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు.లైనెక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌ డీబీఏ,మెయిన్‌ ఫ్రెమ్‌ అడ్మిన్‌, నెట్‌ వర్క్‌ అడ్మిన్‌,  ఆటోమేషన్‌ టెస్టిగ్‌, ఆంగుల్‌ జేఎస్‌, ఒరాకిల్‌ డీబీఏ,జావా డెవలపర్‌, సిట్రిక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌,   ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, డాట్‌ నెట్‌ డెవలపర్‌,ఐఓస్‌ డెవలపర్‌, పైథాన్‌ డెవలపర్‌, విండోస్‌ అడ్మిన్‌,  పీఎల్‌ఎస్‌క్యూఎల్‌ ఏదైనా ఒక విభాగానికి సంబంధించి మహిళలు దరఖాస్తులు చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: