చాలామంది ఈ మధ్యకాలంలో పంటలు పండించడం వల్ల ఎలాంటి లాభం లేదని వ్యవసాయం చేయడమే తగ్గించేశారు.. అయితే మరి కొంతమంది ఉద్యోగాలు బిజినెస్ లు చేసి విసుగు వచ్చి వ్యవసాయం వైపుగా అడుగులు వేస్తున్నారు. అయితే సమయానికి తగ్గ పంట వేసుకొని భారీగానే సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలా వాణిజ్య పంటల ద్వారా కూడా భారీగానే సంపాదించుకోవచ్చట. అలాంటి వాటిలో యాలకుల సాగు కూడా ఒకటి.. కచ్చితంగా ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఇవి అవసరం చాలా కాలం గుణాలు కూడా ఉంటాయి. వాసనకి వాసన ఔషధ గుణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.


ఈ యాలుకలకు మంచి డిమాండ్ ఉన్నది.యాలుకలలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఆకుపచ్చది మరొకటి గోధుమ యాలుకలు.. మనం ఎక్కువగా గోధుమ యాలుకలను ఉపయోగిస్తూ ఉంటాము. యాలుకల మొక్క ఒకటి నుంచి రెండు అంగుళాల పొడవు పెరుగుతుందట. ఈ మొక్క ఆకులు 30 నుంచి 60 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. యాలకల సాగుకు ఎర్ర మట్టి నేల చాలా మంచిదని చెప్పవచ్చు.. యాలుకల సాగు చేయాలి అంటే 10 డిగ్రీల నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఉండాలి.


యాలుకల మొక్కలను కనీసం రెండు మొక్కల మధ్య రెండు అడుగుల దూరం ఉండాలి. యాలుకలను చేతికి వచ్చిన తర్వాత ఎండలో ఆరబెట్టి అమ్మడం వల్ల మంచి లాభాలు వస్తాయి. మార్కెట్లో కిలో యాలకుల ధర రూ .2000 రూపాయల వరకు ఉన్నది. యాలుకలు ఎకరా దిగుబడి బాగా వచ్చిందంటే సుమారుగా 80 నుంచి 100 కిలోల వరకు లభిస్తుందట. దీంతో కనీసం రూ.2.5 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. అయితే అప్పటి యాలుకల ధరను బట్టి లాభాలలో కాస్త వ్యత్యాసం ఉంటుంది. జులై నెలలో వీటిని నాటడానికి సరైన సమయమని చెప్పవచ్చు. ఈ ఆలుకలకు మొక్కలకు ఎక్కువగా ఎండ తగలకుండా చూసుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: