మిస్ అమెరికా గా ఎంపిక అయిన మన తెలుగు అమ్మాయి నీనా దవులూరి పై అమెరికా మీడియా దుమ్మెత్తి పోస్తూ వ్యాఖ్యలు, కధనాలు రాయడమే కాకుండా మన నీనా ను ఎంత వరకూ హింసి౦చాలో అంత మానసిక హింసను నీనా కు పెట్టింది అమెరికా మీడియా. ఈ విషయాన్ని తీసుకొని మన భారతదేశంలోని కొన్ని మీడియా వర్గాలు అమెరికా కు ఇటువంటివి అలవాటే నని అంటూ అమెరికా అంటేనే  రేసిస్ట్ దేశం అని అంటూ మన మీడియా కూడా ఘాటుగా రాతలు రాసి ప్రతిస్పందించింది. అయితే ఈ వార్తలను మీడియా లో చూసిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ మాత్రం మన ఇండియన్ మీడియా పై నిప్పులు చెరుగుతోంది.

రిచా పుట్టి పెరిగింది బెంగాల్ అయినా ఆమె జీవితంలో చాలా ఏళ్ళు అమెరికాలో నివాసం ఉండడంతో రిచా కు అమెరికా పౌరసత్వం వచ్చింది. దీనితో అమెరికన్ పౌరసత్వం వల్ల వచ్చిన దేశాభిమానంతో రిచా గంగోపాధ్యాయ అమెరికా మీడియా నీనా పై చేసిన కామెంట్స్ కు ప్రతిస్పందిస్తూ తప్పంతా అమెరికా మీడియా దే అంటూ రాతలు రాస్తారు ఏమిటి..? మన ఇండియా లో కూడా తెల్లగా ఉన్న అమ్మాయిలకే క్రేజ్ ఉంటుంది, బాగా తెల్లగా ఉండే మిల్కీ బ్యూటీ లకే కోట్లాది రూపాయలను పారితోషికాలుగా ఇచ్చి హీరోయిన్స్ గా నేత్తికేక్కించుకొని పూజ చేస్తారు అంటూ, ఆఖరికి పెళ్లి చూపుల విషయంలో కూడా తెల్లగా ఉండే అమ్మాయిలనే అబ్బాయిలు కోరుకుంటున్న మన ఇండియా లో అమెరికాను టార్గెట్ చేస్తూ రేసిస్ట్ దేశం అని కామెంట్స్ చేయడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నిస్తూ, ముందు మనను మనం సరిచేసుకొని అమెరికాపై విమర్శలు చేస్తే బాగుంటుంది అన్న రిచా మాటలను చూసి ఇండియన్ మీడియా ఆశ్చర్యపోవడమే కాకుండా నల్లగా ఉండే రిచా కు తెల్లటి రంగుపై ఇంతటి కోపం ఏమిటి అంటూ వార్తలు రాస్తున్నాయి. ఎద్ది ఏమైనా అమెరికా మీడియా ను సమర్ధించే ఒక సప్పోర్టర్ మన టాలీవుడ్ హీరోయిన్ కావడం ఆశ్చర్య కరం.  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: