భారత క్రికెటర్ కి సంబంధించి ఎప్పుడు బయట ఏదో ఒక వార్తతో హైలైట్ అవుతున్నాడు కేఎల్ రాహుల్. హార్దిక్ పాండ్యతో కలిసి ఓ టీవీ షోలో అమ్మాయిల గురించి ఇష్టమొచ్చినట్ట్లు వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ ఎంతగా సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాడో అందరికీ తెలిసిందే. దీనికి తోడు రెగ్యులర్‌గా అమ్మాయిలతో ఎఫైర్లంటూ అతను వార్తల్లోకి ఎక్కుతుండటం విశేషం. ఒక అమ్మాయితో రాహుల్ కు ఎఫైర్ అంటారు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఇదిలా ఉండగానే మళ్ళీ  ఇంకో అమ్మాయితో రాహుల్ పేరు వినిపిస్తుంది. ఇంకొన్ని నెలలకు మరో కొత్త అమ్మాయి పేరు తెరపైకి వస్తుంది. 

తెలుగు సినిమాల్లో తళుక్కుమంటున్న నిధి అగర్వాల్ తో ముందుగా రాహుల్ కి ఎఫైర్ అన్నారు. ఇద్దరు డీప్ లవ్ లో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని నిధి ఎక్కడా బయట పెట్టలేదు. ఆ తర్వాత సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టితో రాహుల్ పేరు బాగా వినిపించింది. తాజాగా రాహుల్ ఇంకో కొత్తమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడని.. ఇది మాత్రం కొంచెం సీరియస్సే అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష సింగ్ రంజన్ అని లేటెస్ట్ న్యూస్. ఈ అమ్మాయి సినీ తార కాదు. కానీ సినిమా వాళ్లతో బాగానే సంబంధాలున్నాయట. ఆలియా భట్ కి చాలా క్లోజ్ ఫ్రెండైన ఆకాంక్ష.. అంకిత్ తివారి చేసిన 'తేరే దో నైనా' అని మ్యూజిక్ వీడియోలోనూ నటించింది. 

ఆకాంక్షను ఇన్స్టాగ్రామ్ లో లక్ష మందికి పైగా.. ట్విట్టర్లో ఎనిమిది వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇటీవలే ఆలియా ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కు రాహుల్ ని ఆకాంక్ష పరిచయం చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. రాహుల్ ఒకప్పుడు ప్రేమాయణం నడిపినట్లుగా చెప్పుకున్నఅతియా.. రాహుల్ ఆకాంక్షలతో కలిసి ఫొటో దిగడం విశేషం. ఆకాంక్షతో ఎఫైర్ గురించి రాహుల్ ను అడిగితే మాత్రం.. తన గురించి మీడియాలో, పత్రికల్లో ఏం రాస్తున్నారో తనకు తెలియదని తాను వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడనని.. క్రికెట్ మీదే తన దృష్టి అని సమాధానం చెప్తు అసలు విషయాన్ని పక్కకు తోసేశాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: