
శర్వానంద్, రామ్ ఈ టాలీవుడ్ యంగ్ హీరోలు వెండితెర పై తమకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేష్ చేసుకున్నారు. టాప్ హీరోలకు ధీటుగా సాగుతూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నారు. సినిమాల ఎంపిక నుండే డిఫరెంట్‌గా ఆలోచించే ఈ ఇద్దరు హీరోలు నటనలోనూ వైవిధ్యాన్ని చూపించాలని తపిస్తారు. ముఖ్యంగా శర్వానంద్ గమ్యం, ప్రస్థానం, జర్నీ చిత్రాలతో నటుడిగా తన సత్తాను చాటాడు. శతమానం భవతితో మంచి హిట్ కొట్టాడు. మారుతి మహానుభానువు పర్వాలేదనిపించుకుంది. రణరంగం పూర్తి డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ మధ్య వచ్చిన జాను చిత్రం యావరేజ్ టాక్ని మూటగట్టుకుంది. శర్వా ఒకరకంగా చెప్పాలంటే కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి.
ఇక రామ్ విషయానికి వస్తే దేవదాస్ చిత్రంతో తెరంగేట్రం చేసి జగడం, రెఢీ, కందిరీగ, పండగచేస్కో వంటి చిత్రాలతో మంచి మార్కులే కొట్టేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ఒకటి రెండు చిత్రాలు కాస్త ఫ్లాప్ అయినా కూడా ఈ మధ్య వచ్చిన పూరిదర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ కొట్టిందనే చెప్పాలి. ఇక ఈ ఇద్దరు యంగ్ హీరోల విషయానికి వస్తే మంచి ఫ్రండ్సే కాకుండా అంతకు మించి రిలేటివ్స్ అన్నది మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా. అయితే వాస్తవానికి రామ్ శర్వానంద్ బావా బావమరుదులు. హీరో రామ్ అక్క మధుస్మితను శర్వానంద్ అన్నయ్యకు ఇచ్చి పెళ్ళి చేశారు. ప్రస్తుతం మధుస్మిత దంపతులు అమెరికాలో హ్యాపీగా ఉన్నారు. రామ్, శర్వా ఫ్యామిలీలు ఆర్ధికంగా మంచి స్థితిలో ఉండడమే కాదు. రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్ళుగా పరిచయం కూడా ఉంది.
ఈ పరిచయం కాస్త పెళ్ళితో బంధుత్వంగా మారింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్, శర్వా కుటుంబాలతో పరిచయం ఉన్నవారికి మాత్రమే ఈ విషయం తెలుసు. ఇకపోతే ఈ హీరోలిద్దరూ బావ బావమరుదలన్న విషయం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు కూడా. బంధుత్వమున్నా లేకపోయినా తామిద్దరం మంచి స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడతామని చెపుతారు. అంతేకాక సినిమాల ఎంపికలో ఒకరికి ఒకరు సాయం కూడా చేసుకుంటారు. ఏదైన కొత్త కథ తమ వద్దకు వస్తే వీలైతే ఇద్దరు కలిసి వింటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా రామ్, శర్వానంద్లే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు.