చెప్పినట్టుగానే బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు దద్దరిల్లిపోయింది. అనిల్ రావిపూడి మాస్ పల్స్ కు ఫ్లాటైన మహేష్ బాబు మరోసారి అనిల్ రావిపూడికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చినట్టు వినిపిస్తోంది. అయితే ప్రిన్స్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని అనిల్ రావిపూడి సున్నితంగా తిరస్కరించాడట. 

 

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హ్యాట్రిక్ సక్సెస్ లతో మహేశ్ బాబు దూకుడు మీదున్నాడు. ప్రస్తుతం ప్రిన్స్ గీతా గోవిందంతో సెన్సేషన్ హిట్ కొట్టిన పరశురామ్ డైరెక్షన్ లో న్యూ మూవీకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఈ టాక్ నడుస్తుండగానే మహేశ్ ఆ తర్వాత మరోసారి అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చాడట. కానీ ప్రిన్స్ ఇచ్చిన ఛాన్స్ ను అనిల్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. 

 

సరిలేరు నీకెవ్వరుతో  అనిల్ రావిపూడి మహేశ్ బాబుకు మధ్య మంచి బాండింగ్ కుదిరిందట. చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరులో అన్ని రకాలుగా అదరగొట్టాడు. ప్రిన్స్ తో అనిల్ రావిపూడి చేయించిన యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ యంగ్ డైరెక్టర్ ఎంటర్ టైన్ మెంట్, మాస్ పల్స్ కు ఫ్లాటైన మహేశ్ మరోసారి పిలిచి ఛాన్స్ ఇచ్చినా అనిల్ రావిపూడి మాత్రం సింపుల్ గా నో చెప్పడం ఆసక్తికరంగా మారింది. 

 

పరశురాం సినిమా తర్వాత మరోసారి సినిమా చేసేందుకు రెడీగా ఉండాలని మహేశ్ బాబు, అనిల్ రావిపూడికి చెప్పినట్టు వినిపిస్తోంది. రెండు నెలల్లో స్క్రిప్ట్ కూడా రెడీ చేయమని సూచించాడట. అయితే అంత తక్కువ టైమ్ లో క్వాలిటీ స్క్రిప్ట్ అందించడం కష్టమని భావించిన అనిల్ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు టాక్.
మీరో మరో సినిమా చేస్తే సరిలేరు నీకెవ్వరుకు మించి ఉండాలని.. అందుకోసం కాస్త ఎక్కువ టైమ్ కావాలని కోరాడట. బహుశ ఎఫ్ 3 తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కావొచ్చు.

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: