పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అని ఎవరైనా అంటే చాలు జనాలు తెగ ఆనందపడిపోతారు. పెళ్లికి అలాంటి ప్లేస్ ఉంది మరి. అయితే ఇలాంటి సొసైటీలో ఉన్న నెటిజన్లు మాత్రం కొంతమంది హీరోయిన్లకు మళ్లీ మళ్లీ పెళ్లి చేస్తున్నారు. వాళ్ల ప్రమేయం లేకుండానే అబ్బాయిలను వెతికిపెట్టి మరీ పెళ్లి పీటలెక్కిస్తున్నారు. 

 

ఇప్పుడు సౌత్ లో సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ అనగానే గుర్తుకొచ్చే పేరు కీర్తి సురేష్. మహానటితో నేషనల్ అవార్డు అందుకొని కెరీర్ బిగినింగ్ లోనే బెస్ట్ పెర్ఫామర్ అనిపించుకుంది. ఈ టాలెంట్ తోనే తెలుగు, తమిళ్, మళయాళి సినిమాలతో బిజీగా ఉంది. మరో ఏడాది వరకు కొత్తగా కాల్షీట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉంది. అలాంటి హీరోయిన్ ను పెళ్లి పీటలెక్కించారు గాసిప్ రాయుళ్లు. 

 

కీర్తి సురేశ్ పెర్ఫామెన్స్ కంటే ఈమె పర్సనల్ లైఫ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది డిజిటల్ మీడియా. సౌత్ క్వీన్ గా ఎదగాలనే ఆలోచనలో ఉన్న కీర్తికి పెళ్లి సంబంధాలు వెతుకుతోంది. ఈ హీరోయిన్ త్వరలోనే మేరీడ్ లైఫ్ స్టార్ట్ చేస్తుందని, ఓ బీజేపీ నాయకుడి కొడుకుతో కలిసి ఏడడుగులు వేయబోతోందని రాతలు రాశారు. 

 

డిజిటల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్లిన ఈ పెళ్లి వార్తలు కీర్తి సురేశ్ ను టచ్ చేశాయి. ఇక జనాల్లోకి పెళ్లి రాతలు విస్తృతంగా వెళ్లడంతో ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చింది. ఒక ఏడాది వరకు డైరీ ఫుల్ గా ఉంది. ఇలాంటి టైమ్ లో పెళ్లి గురించి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి. ఇలాంటి పుకార్లు పుట్టించేవాళ్లు కొంచెం ఆలోచించాలి అన్నట్టు మాట్లాడింది. మొత్తానికి అందాల నటి కీర్తి సురేశ్ కు గాసిప్ రాయుళ్లు పెళ్లిళ్లు వరుసగా చేసేస్తున్నారు. మరి ఇలాంటి పుకార్లకు ఎపుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: