బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ కి దేశ విదేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. సినిమా హిట్‌, ఫ్లాప్ ల‌తో సంబంధం లేకుండా షారుఖ్‌ని అభిమానిస్తుంటారు. ఇక కాజోల్,షారూఖ్ జంటగా నటించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వీరిద్ద‌రూ తెర‌పైన క‌నిపిస్తే చాలు ఫ్యాన్స్‌కి పండ‌గ‌నే చెప్పాలి. వీరిద్ద‌రి కాంబినేష‌న్ అంత అద్భుత‌మ‌ని చెప్పాలి. తెర మీద వీరిద్ద‌రూ క‌లిసి న‌టించే రొమాంటిక్ సీన్స్ అయితే ఇక చెప్ప‌క్క‌ర్లేదు ఎవ‌రైనా సూప‌ర్బ్ అనాల్సిందే.  బాలీవుడ్ సూపర్ జోడీగా పేరొందిన ఈ జంట సినిమాకు మొదటి నుంచి విపపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

 

ఇక ఇటీవ‌లె వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన చిత్రం దిల్‌వాలే... షారూఖ్ ఖాన్ ల కెమిస్ట్రీ, అర్జీత్ సింగ్, అంత్రా మిత్రా నేపథ్యగానం పర్ ఫెక్ట్ గా సెట్టయ్యాయి. గతంలో రాజ్ కపూర్, నర్గీస్ సూపర్ హిట్ కాంబినేషన్ తో రూపొందిన సాంగ్ ‘ప్యార్ హువా’ (శ్రీ 420) స్టయిల్లోనే వీరిద్దరూ గొడుగులు పట్టుకుని ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ పలికించిన రొమాన్స్ అదిరిందని అంతా అంటున్నారు. రోహిత్ శెట్టి దర్వకత్వం వహించిన కాజోల్, షారూఖ్ లతో పాటు వరుణ్ ధావన్, కృతి సనన్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. 

 

వీళ్ళిద్దరూ నటించిన ప్రేమ కథా చిత్రాలకి ప్రేక్షకులు ఫిదా అయిపోవాల్సిందే. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే', 'కుచ్‌ కుచ్‌ హోతా హై' వంటి సినిమాలు యూత్‌ని ఓ ఊపు ఊపాయ‌నే చెప్పాలి. ఆ తర్వాత వీరిద్దరు కొన్ని సినిమాల్లో నటించినా ఈ మధ్య కాలంలో కలిసి నటించే అవకాశం అయితే రాలేదు. పెళ్ళి తర్వాత కాజోల్‌ సినిమాల్లో నటించడం తగ్గించినా.. అడపాదడపా స్పెషల్‌ ఎట్రాక్షన్‌లో అప్పుడ‌ప్పుడు తెర మీద త‌ళుక్కుమంటోంది. ఇక షారూఖ్‌ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ జోడీని వెండితెర మీద చూపించాలని రోహిత్‌శెట్టి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాకి 'దిల్‌వాలే' అని టైటిల్‌ని కూడా పెట్టారు. హిట్‌ఫెయిర్‌ మళ్ళీ సిల్వర్‌స్క్రీన్‌ మీద మాంఛి రొమాంటిక్‌ కెమెస్ట్రిని పండించేస్తారని అందరూ అనుకుంటున్న తరుణంలో కాజోల్‌ ఆయా దర్శక, నిర్మాతలకు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఈ చిత్రం కోసం ఈ భామ‌ సింపుల్‌గా ఓ 5 కోట్లు పారితోషికం అడిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: