బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ కన్ ఫ్యూజన్ లో పడిపోయింది. బాహుబలి 2 రిలీజై మూడేళ్లు దాటినా.. ఇప్పటికీ ఆ డైలమా కొనసాగుతూనే ఉంది. సినిమా రిలీజ్ విషయంలోనే కాదు.. చివరి ఫస్ట్ లుక్.. టైటిల్ ఎనౌన్స్ మెంట్.. ఇలా ఒకటేంటి అన్నీ ఆలస్యమే. లేటెస్ట్ మూవీ టైటిల్ ఫిక్స్ అయినా.. ఎనౌన్స్ చేయలేకపోతున్నారు. ప్రభాస్ ఒక్కడికే ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసా. 

 

ప్రభాస్ కెరీర్ లో గందరగోళ ప్రస్థానం సాహో నుంచి మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ గా శంకర్ ఎసాన్ లాయ్ ను తీసుకొని.. చివరికి నలుగురు సంగీత దర్శకులు ఒక్కో పాటకు వర్క్ చేశారు. రిలీజ్ విషయంలో కూడా.. అదిగో ఇదిగో అంటూ.. రెండేళ్ల తర్వాత థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. ఇదే పరిస్థితులు ప్రభాస్ 20వ సినిమా విషయంలో కూడా జరుగుతోంది. 

 

ప్రభాస్, పూరీ జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మొదలై ఏడాదిన్నర అయింది. ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది. సినిమా టైటిల్ విషయంలో కూడా కన్ ఫ్యూజన్ మొదలైంది. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైనా.. రాధే శ్యామ్.. ఓ డియర్ లాంటి టైటిల్స్ తెరపైకి వచ్చాయి. టైటిల్స్ తో విసిగిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా.. రాధే శ్యామ్ టైటిల్ ఫిక్స్ చేసేశారు. చిత్ర వర్గాలు కూడా అన్ని భాషల్లో ఇదే టైటిల్ అనుకుంటున్నా.. ఎనౌన్స్ చేసేందుకు ముహూర్తం సరిపోవడం లేదు. 

 

సాహో విషయంలో జరిగిన మ్యూజిక్ డైరెక్టర్ డైలమా రాదే శ్యామ్ విషయంలో కూడా రిపీట్ అయింది. సినిమా 60శాతం పూర్తయినా.. ఇంతవరకు మ్యూజిక్ డైరెక్టర్ సెట్ కాలేదు. సాహోకు బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన జిబ్రాస్ పేరు వినిపిస్తున్నా.. సాహో మాదిరి ముగ్గురు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కో ట్యూన్ ఇస్తారేమో చూడాలి. రాధే శ్యామ్ ఈ కన్ ఫ్యూజన్ నుంచి బయటపడి.. ఫ్యాన్స్ మొహంలో ఆనందం చూస్తాడో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: