బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ.. పాన్‌ ఇండియాలోకి అడుగుపెడితే... కెజిఎఫ్‌తో కన్నడ ఇండస్ట్రీ పాన్‌ ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది.  కెజిఎఫ్‌ కన్నడతోపాటు తెలుగు, తమిళం.. హిందీలో హిట్‌ కావడంతో. దీని సీక్వెల్‌ కేజీఎఫ్‌2కు డిమాండ్‌ పెరిగిపోయింది. డిజిటల్‌ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయట.  దాదాపు సగం బడ్జెట్‌ దీంతోనే రికవరీ అయ్యిందట.

 

కెజిఎఫ్‌ వచ్చే వరకు హీరో యశ్‌ .. దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెలుగువారికి పరిచయం లేని పేర్లు. కెజిఎఫ్‌ సక్సెస్‌తో యశ్‌ తెలుగులో క్రేజీ హీరో అయిపోయాడు. ఇక ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నటించాలని  మనస్టార్స్ కూడా వెయిట్ చేస్తున్నాడు. బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన కెజిఎఫ్ సీక్వెల్‌ కెజిఎఫ్‌ 2 అక్టోబర్‌ 23న రిలీజ్‌ అవుతోంది. 

 

కెజిఎఫ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌కు మంచి లాభాలు తీసుకురావడంతో... కెజిఎఫ్‌2 బిజినెస్‌ 300 కోట్లు దాటుతుందని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాను కూడా అంతే భారీగా 150 కోట్లకు పైగా బడ్జెత్‌తో తెరకెక్కిస్తున్నారు. కెజిఎఫ్‌తో పోల్చుకుంటే.. సీక్వెల్‌కు బడ్జెట్‌ డబుల్‌ అయింది. ప్రాజెక్ట్‌కు వున్న హైప్‌ బడ్జెట్‌లో సగం ముందే రాబట్టేస్తోంది. డిజిటర్‌ రైట్స్‌  55 కోట్లు తెచ్చిపెట్టిందట. 

 

కెజిఎఫ్‌2ను కూడా దక్షిణాది భాషలన్నింటితోపాటు.. హిందీలో కూడా రిలీజ్‌  చేస్తారు. అన్నిభాషల్లో డిజిటర్‌ రైట్స్‌ను అమేజాన్‌ 55 కోట్లు ఇచ్చి సొంతం చేసుకుందని సమాచారం. కెజిఎఫ్‌ను కూడా అమేజానే తీసుకుంది. ఎక్కువమంది ఈ సినిమాను వీక్షించారని గతంలో అమేజాన్‌ ప్రైమ్‌ పేర్కొంది.  దీంతో.. సీక్వెల్‌ను కూడా ఫ్యాన్సీ రేటిచ్చి అదే డిజిటల్‌ నెట్‌వర్క్‌ తీసుకుంది. 

 

మొత్తానికి కెజిఎఫ్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో యశ్ ప్రేక్షకుల మదిలో నాటుకుపోయాడు. అందుకే ఆ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. కెజిఎఫ్ 2కూడా సిద్ధమైపోయింది. ఇంకేముందీ దీంతో కెజిఎఫ్ 2 డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడుపోతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: