శృతి హాసన్ చాలా బోల్డ్ గా ఉంటుంది. అన్నీ ఓపెన్ గానే మాట్లాడుతుంది. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో రిలేషన్ ను కూడా పబ్లిక్ గానే మెయింటైన్ చేసింది. బ్రేకప్ ని కూడా ఇలాగే అందరికీ చెప్పేసింది. అన్ని విషయాల్లో ఓపెన్ గా ఉండే శృతీ హాసన్ హీరోయిన్లందరినీ ప్లాస్టిక్ ముఖాలు అని కామెంట్ చేసింది. ప్రతీ ఒక్కరూ సర్జరీ చేయించుకున్న వాళ్లే అని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
శృతీహాసన్ రీసెంట్ గా ఓ న్యూస్ పోర్టల్ తో ఇంటరాక్ట్ అయింది. ఈ ఇంటరాక్షన్ లో శృతిని ప్లాస్టిక్ సర్జరీ గురించి అడిగారు. దీనికి సమాధానంగా అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. నా ముక్కు షేప్ మార్చుకున్నాను. నన్నెవరూ సర్జరీ చేయించుకోవాలని చెప్పలేదు. నాకు నేనుగా ముక్కుని షార్ప్ గా మార్చుకున్నాను. వెస్ట్రన్ ఫేస్ కట్ తెచ్చుకున్నానని చెప్పింది శృతీ.
శృతీ హాసన్ మరో ప్రశ్నకు సమాధానంగా.. నేను ఒక్కతినే కాదు ఇండస్ట్రీలో హీరోయిన్ లు అంతా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్లే. ఎవరైనా నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు అంటే వాళ్లు అబద్దం చెప్పినట్టే అని స్టేట్ మెంట్ ఇచ్చింది శృతీ. దీంతో హీరోయిన్ లు అంతా శృతీ హాసన్ పై చాలా గుర్రుగా ఉన్నారట. మాపై ఇలాంటి కామెంట్ చేస్తుందా.. మా అందాన్ని తక్కువ చేస్తుందా అని ఫైర్ అవుతున్నారట. మరి వాళ్లను శృతీ ఎలా కూల్ చేస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి